దీదీ ఢిల్లీ పర్యటనపై జోరుగా ఊహాగానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదురోజుల ఢిల్లీటూర్‌లో బెంగాల్ సీఎం మమత బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై పోరాటంలో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ గాంధీలతో సమావేశమైన మమత… తమ మధ్య సమావేశం పూర్తి సానుకూలదోరణిలో జరిగిందన్నారు. దీని ఫలితాలు భవిష్యత్తులో కనిపిస్తాయన్నారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ బంపర్ విక్టరీ తర్వాత తొలిసారిగా మమత.. సోనియాతో సమావేశమయ్యారు. ఢిల్లీలో వరుసగా విపక్షనేతలతో మమత సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో… మమత కూడా నేతలతో సమావేశం కావడం, రాజకీయంగా చర్చనీయాంశమైంది.
పెగసస్ స్పైవేర్ కాంట్రవర్సీ, కోవిడ్-19 పరిస్థితి.. తమ మధ్య చర్చకు వచ్చినట్లు, మమత తెలిపారు పెగసస్ కాంట్రవర్సీపై కేంద్రం ఎందుకు చర్చకు సిద్ధం కావడం లేదన్నారు. పార్లమెంటులో ప్రజాసమస్యలపై చర్చ జరగకపోతే.. ఇంకెక్కడ జరుగుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం సభలో సమాధానమిచ్చేవరకూ, విపక్షాలు.. సభను జరగనివ్వవన్నారు మమత. ఇక, ఇవాళ ఎన్సీపీ నేత పవార్ సహా పలువురు కీలక నేతలతో మమత భేటీ కానున్నారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలు అనుసరించాల్సిన వ్యూహాలను.. ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఇక, మమత ఢిల్లీ పర్యటనపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఒకరి తర్వాత మరొకరితో మమత వరుసగా సమావేశం అవుతున్నారు. సోనియా, కేజ్రీవాల్‌లను కూడా కలిశారు. ఇప్పుడు శరద్ పవార్‌తో కూడా సమావేశం అవుతున్నారు. విపక్ష కూటమికి ఎవరు మద్దతిచ్చినా ఓకే అంటున్నారు. పరిస్థితి చూస్తే 2023లో కేంద్రంలో మోడీ వర్సెస్ మమత అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంతకీ మమతా బెనర్జీ యాంటీ మోడీ ఫ్రంట్‌ను లీడ్ చేయగలరా? విపక్షాల ఐక్యత సాధ్యమేనా..? విపక్షాలన్నీ ఒకే తాటిపైకి రాగలవా? అంత శక్తి ఉందా? అనే చర్చ సాగుతోంది.
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
- Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?