భవానీపూర్ ఉప ఎన్నిక ముగిసింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ తరపున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి ప్రియాంక బరిలో ఉన్నారు. అయితే, ఇది ముఖ్యమంత్రి సిట్టింగ్ స్థానం కావడంతో అమె విజయం నల్లేరుపై నడకే అయినప్పటికీ, బీజేపీ గట్టి పోటి ఇవ్వనుందని సర్వేలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక జరిగే సమయంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు మధ్య జరిగిన…
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృష్టిసారించారు ఆ పార్టీ అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆ బాధ్యతను తన మేనల్లుడికి అప్పగించారు.. ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానిస్తున్నారు. గోవాపై కూడా టీఎంసీ దృష్టిసారించింది.. ఇవాళ గోవా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత లూజినో ఫలీరో.. టీఎంసీ గూటికి చేరారు.. కోల్కతాలోని టీఎంసీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక…
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత కూడా పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది.. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కొందరు నేతలు.. టీఎంసీ విజయం సాధించి.. మరోసారి మమతా బెనర్జీ సీఎం అయిన తర్వాత తిరిగి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. అందులో ఒకరు ఎమ్మెల్యే ముఖుల్ రాయ్.. అయితే.. బీజేపీ టికెట్పై గెలిచి టీఎంసీలో చేరిన ఎమ్మెల్యే ముఖుల్ రాయ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత,…
వచ్చే ఏడాది దేశంలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో గోవా కూడా ఒకటి. దేశంలో బీజేపీని ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలన్ని కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నాయి. బెంగాల్ ఎన్నికల తరువాత దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు ఒక్కటిగా కలిసి పనిచేసుందుకు ముందుకు వస్తున్నాయి. కాగా గోవాలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండటంతో బీజేపీకి ఇప్పటి వరకు కలిసి వచ్చింది. కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆప్ ఇప్పటికే రంగంలోకి…
పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ కు ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే, భవానీ పూర్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్నారు. కొన్నినెలల క్రితం జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సిట్టింగ్ స్థానం భవానీ పూర్…
పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి మరోషాక్ తగిలింది. ఆపార్టీ అసన్సోల్ ఎంపీ బాబుల్ సుప్రియో ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు ఉదయం ఆయన తృణమూల్ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల తరువాత బాబూలాల్ సుప్రియో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవలే జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ప్రకటించారు. అయితే, ఈనెలలో బెంగాల్లో మూడు అసెంబ్లీ…
ఈనెల 30 వ తేదీన పశ్చిమ బెంగాల్కు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. భవానీ పూర్ నియోజక వర్గానికి జరిగే ఉప ఎన్నికలపై అందరి దృష్టి నిలిచింది. ఈ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీలోఉండగా, బీజేపీ నుంచి ప్రియాంక తిబ్రేవాల్ పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయం నల్లేరుపై నడకే అయినప్పటికీ నందిగ్రామ్ ఓటమి తరువాత మమతా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, బెంగాల్ అసెంబ్లీ…
బెంగాల్లోని భవానీ పూర్ నియోజకవర్గానికి ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉండగా, బీజేపీ నుంచి ప్రియాంక పోటీ చేస్తున్నారు. ఇక సీపీఐ నుంచి శ్రీజివ్ బిశ్వాస్ బరిలో ఉన్నారు. నందిగ్రామ్ నుంచి ఓడిపోయిన మమతా బెనర్జీ తన సొంత నియోజక వర్గం భవానీపూర్ నుంచి బరిలో దిగారు. అమె విజయం నల్లేరుపై నడకే అని చెప్పొచ్చు. అయిన్పటికి బీజేపీ…
భారతీయ జనతా పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసంపై దుండగులు బాంబులు విసరడంతో తీవ్ర కలకలం రేపింది.. పూర్తి వివారాల్లోకి వెళ్తే.. కోల్కతాలోని ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి దగ్గర ఇవాళ ఉదయం బైక్పై వచ్చిన కొందరు దుండగులు బాంబులు విసిరారు.. మొత్తం మూడు బాంబులు ఇంట్లోకి విసిరే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుండగా.. అవి ఇంటి గేటు దగ్గర పేలాయి.. ఈ ఘటనలో ఇంటి గేటు ధ్వంసం అయ్యింది. ఇక, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో.. అంతా…
ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ సీట్లుకు సంబందించి ఎన్నికన షెడ్యూల్ను రిలీజ్ చేసింది. వెస్ట్ బెంగాల్లో మూడు అసెంబ్లీ స్థానలకు, ఒడిశాలో ఒక అసెంబ్లీ నియోజక వర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి. వెస్ట్ బెంగాల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే హడావుడి మొదలైంది. నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మమతా బెనర్జీ తన పాత నియోజక వర్గమైన భాబినీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గం…