దేశంలో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నది. సోనియా గాంధీ అధ్యక్షతన ఈరోజు వివిధ పార్టీలతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి వివిధ పార్టీలకు ఆహ్వానించారు. తృణమూల్‌తో సహా వివిధ పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. అయితే ఆప్, ఆకాళిదళ్ పార్టీలకు మాత్రం ఆహ్వానం అందలేదు. ఈ రెండు పార్టీలు మినహా మిగతా విపక్షపార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా వేయాల్సిన అడుగులు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. Read:…
అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం.. మళ్లీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.. గతంలో పార్టీకి దూరమైనవారు కూడా తిరిగి టీఎంసీ గూటికి చేరుతున్నారు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుస్మితా దేవ్.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సుత్మితా దేవ్.. టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఒబ్రెయిన్ సమక్షంలో టీఎంసీ కండువా…
బెంగాల్లో మూడోసారి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీకి దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగిపోతున్నది. దేశంలోని అన్ని అన్నిరాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలనే అలోచనలో దీదీ ఉన్నట్టు సమాచారం. దానికి ఇదే సాక్ష్యం అని చెప్పొచ్చు. కేరళలో దీదీని పిలవండి… దేశాన్ని కాపాడండి…ఛలో ఢిల్లి… పేరుతో పోస్టర్లు వెలిశాయి. కేరళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఈ పోస్టర్లు వెలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 34 ఏళ్లు ఏకచక్రాధిపత్యంగా బెంగాల్‌ను శాశించిన వామపక్షాల కోటను బద్దలుకొట్టి 2011లో దీదీ అధికారంలోకి వచ్చింది.…
పార్లమెంట్ సమావేశాలలో విపక్ష పార్టీల ఉమ్మడి వ్యూహం ఖరారు చేసేందుకు ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ అధ్యక్షత సమావేశం అయ్యారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు… తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ.. ఎస్పీ, సీపీఎం, ఆమ్ఆద్మీ, సీపీఐ, ఇలా 14 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వంపై పోరాటం చేసే విధంగా ఉమ్మడి వ్యూహాన్ని రచించేలా సమాలోచనలు జరిపారు. అంతేగాక, కేంద్రం తీరుకు నిరసనగా పార్లమెంట్ బయట…
పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది… త్రిపురలో పర్యటిస్తున్నారు అభిషేక్ బెనర్జీ.. అయితే, ఆయన కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడికి పాల్పడ్డారు.. వారు బీజేపీ జెండాలను పట్టుకుని ఉన్నారు.. అయితే, తనపై దాడికి పాల్పడింది బీజేపీ నేతలేనంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు అభిషేక్ బెనర్జీ.. బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది అంటూ మండిపడ్డ ఆయన.. విప్లవ్ దేవ్ మీరు…
ఇటీవల పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మూడోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలు బీజేపీపైన, ప్రధాని మోడీపైన పలురకాల విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక, టిఎంసీ పార్టీ ఎమ్మెల్యే మదన్ మిత్ర చాయ్‌వాలా అవతారం ఎత్తారు. ప్రజలకు ఆయన ఉచితంగా టీ తయారు చేసి అందించారు. టీ ధర రూ.15 లక్షలు అని ప్రజలు రూ.15 లక్షలు కట్టాలని, 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి…
ఐదురోజుల ఢిల్లీటూర్‌లో బెంగాల్ సీఎం మమత బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై పోరాటంలో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ గాంధీలతో సమావేశమైన మమత… తమ మధ్య సమావేశం పూర్తి సానుకూలదోరణిలో జరిగిందన్నారు. దీని ఫలితాలు భవిష్యత్తులో కనిపిస్తాయన్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బంపర్ విక్టరీ తర్వాత తొలిసారిగా మమత.. సోనియాతో సమావేశమయ్యారు. ఢిల్లీలో వరుసగా విపక్షనేతలతో మమత సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న…
బెంగాల్ సీఎంగా మూడోసారి ఎంపికయ్యాక మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటకు వెళ్లారు. ఢిల్లీలో ప్రధాని మోడితో సహా అనేక మంది నేతలతో దీదీ భేటీ కాబోతున్నారు. కొద్ది సేపటి క్రితమే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన వరద సాయం, వ్యాక్సిన్ డోసులు, రాష్ట్రం పేరు మార్పు తదితర విషయాలపై ఆమె ప్రధానితో చర్చించారు. ప్రస్తుతం దేశాన్ని పెగాసస్ స్పేవేర్ అంశం కుదిపేస్తున్నది. దీనిపై పార్లమెంట్లో పూర్తి స్థాయిలో చర్చ…
ఐదు రోజుల పర్యటన కోసం మమత బెనర్జీ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ టూర్లో విపక్ష నేతలతో పాటు.. ప్రధాని మోడీని కలుస్తారని తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయాలని మమత భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. జులై 28న ప్రధాని మోడీని, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను కలవనున్నారు మమతా బెనర్జీ.. అయితే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి…