వచ్చే ఏడాది దేశంలోని అనేక రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో గోవా కూడా ఒకటి. ఎలాగైనా గోవాలో అధికారం అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్‌లు చూస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టి హమీలు గుప్పిస్తున్నారు. నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ గోవాలో పర్యటించి మహిళలను ఆకట్టుకునే విధంగా హామీలు ఇచ్చారు. 24 గంటలు గడవక ముందే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు భారీ వరాలు ప్రకటించింది.…
బీజేపీని కేంద్రంలో అధికారం నుంచి తప్పించేందుకు టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కంకణం కట్టుకున్నారు. దీనికోసం నిత్యం అన్ని పార్టీల ప్రముఖ రాజకీయ నేతలను మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆమె శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. అనంతరం శరద్ పవార్ మాట్లాడుతూ.. బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం కావాలన్నారు. అంతేకాకుండా టీఎంసీతో మాకు పాత అనుబంధం ఉందని గుర్తు…
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు పార్లమెంటీరీ సమావేశాలు నిర్వహించుకుంటూ సమావేశాల్లో ప్రత్యర్థులపైన పన్నాల్సిన వ్యూహాలను రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బేజేపీ కూడా పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ నేతలు ఖరారు చేయనున్నారు. అంతేకాకుండా విపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు నేతలు సమాయత్తం అవుతున్నారు. దీనితో పాటు సాయంత్రం 5గంటలకు రాజ్యసభ…
మేఘాలయ టీఎంసీ ఛీఫ్‌గా ముకుల్ సంగ్మా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITMC)లో మేఘాలయ ముఖ్యమంత్రి డాక్టర్ ముకుల్ సంగ్మా చేరారు. శుక్రవారం షిల్లాంగ్‌లో జరిగిన టీఎంసీ పార్టీ కొత్తగా ఏర్పడిన మేఘాలయ యూనిట్ తొలి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.మొదటి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ముకుల్ సంగ్మాతో సహా మొత్తం 12 మంది శాసనసభ్యులు హాజరయ్యారని ఉమ్రోయ్ నియోజకవర్గ…
ఏరాష్ర్టంలో చూసిన రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార పార్టీ అక్కడి ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి ఆయా నాయ కులను చేర్చుకునే పనిలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్రస్థాయి పార్టీగా ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఇపుడు జాతీయ పార్టీగా మారుతోంది. ఇదే క్రమంలో ఆయా రాష్ట్రాల్లో శాఖలు ఏర్పాటు చేస్తున్నారు బెంగాల్ సీఎం, పార్టీ చీఫ్ మమతా బెనర్జీ. ఇటీవల గోవాలోనూ ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడి ప్రచారం లో భాగంగా భారత టెన్నిస్…
జనతాదళ్ (యునైటెడ్) బహిషృత నేత, రాజ్యసభ మాజీ ఎంపీ పవన్ వర్మ(68) తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. మంగళవారం మమతా బెనర్జీ సమక్షంలో ఆయన టీఎంసీ పార్టీ జెండా కప్పుకున్నారు. మూడు రోజుల రాజధాని పర్యటనలో భాగంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. పవర్ వర్మను పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవన్ వర్మ రాకతో టీఎంసీ బలం పెరుగుతుందని, ఆయన అనుభవాలు పార్టీకి పనిచేస్తాయని మమతా పేర్కొన్నారు. ఇలాంటి…
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఆమె ఢిల్లీలో పర్యటించనున్నారు.. ఈ నెల 22న హస్తినకు వెళ్లనున్న ఆమె.. తిరిగి 25న కోల్‌కతాకు చేరుకోనున్నారు.. ఈ పర్యటనలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది.. ఇదే సమయంలో.. ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు,…
ఆదివారం భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన కార్యక్రమానికి కేంద్ర మంత్రు లెవరూ హాజరు కాలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. “ఈరోజు పార్లమెంట్‌లో అసాధారణ దృశ్యం… లోక్‌సభ స్పీకర్ గైర్హాజరు. చైర్మన్ రాజ్యసభ గైర్హాజరు. ఒక్క మంత్రి కూడా హాజరు కాలేదు” పరిస్థితి అసాధారణంగా ఉందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. “ఇది ఇంతకంటే దారుణం కాగలదా?” అని రాజ్యసభ ఎంపీ అన్నారు. అని రమేష్…
అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడ అంతా బీజేపీ వైపు చూశారు.. ఆ తర్వాత ఇప్పుడు ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు.. అదే పశ్చిమబెంగాల్.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వానేనా అంటూ సాగిన సమరంలో.. మరోసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది.. మళ్లీ బెంగాల్ సీఎం పీఠాన్ని అధిరోహించారు మమతా బెనర్జీ.. అయితే, ఎన్నికలకు ముందు టీఎంసీ లీడర్లను ప్రలోభాలకు గురిచేసి.. బీజేపీ కొంతమందిని ఆ పార్టీలో చేర్చుకున్నాయనే విమర్శలు…
మరో నాలుగు నెలల్లో గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలు చూస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకొని మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నది. అయితే, దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ప్రభావం ఈ ఎన్నికలపై కనిపించే అవకాశం ఉన్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటుగా ఈసారి గోవా నుంచి తృణమూల్, ఆప్ పార్టీలు కూడా బరిలోకి…