దేశంలో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నది. సోనియా గాంధీ అధ్యక్షతన ఈరోజు వివిధ పార్టీలతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి వివిధ పార్టీలకు ఆహ్వానించారు. తృణమూల్‌తో సహా వివిధ పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. అయితే ఆప్, ఆకాళిదళ్ పార్టీలకు మాత్రం ఆహ్వానం అందలేదు. ఈ రెండు పార్టీలు మినహా మిగతా విపక్షపార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా వేయాల్సిన అడుగులు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.
Read: కన్న కూతుళ్లనే అమ్మేసిన తాలిబన్ ఉగ్రవాది…