Mamata Banerjee : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ క్షమాపణ చెప్పారు. ఇటీవల తమ పార్టీ ఎంపీ అఖిల్ గిరి రాష్ట్రపతి పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.
తినే ఫుడ్‌పై కూడా ఆంక్షలు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.. అయితే, ఓ వర్గం నడిపే హోటళ్లలో మరో వర్గాన్ని టార్గెట్ చేసి.. వారి శృంగార సామర్థ్యం క్రమంగా దెబ్బతినే విధంగా.. సంతానం కూడా కలగకుండా ఉండేలా.. కొన్ని దినుసులు వాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.. సోషల్ మీడియాలోనూ ఆ వర్గం నడిపే హోటళ్లలో బిర్యానీ కానీ, ఇతర తినుబండారాలు కొనగోలు చేయొద్దు, తినొద్దు అంటూ ప్రచారం చేసేవాళ్లు లేకపోలేదు.. అయితే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్…
Mithun Chakraborty comments on TMC: బీజేపీ నేత, సినీ నటుడు మిథున్ చక్రవర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)పై విమర్శలు గుప్పించారు. గత జూలైలో మిథున్ చక్రవర్తి.. టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. తాజాగా మరోసారి ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. తాను జూలైలో చేసి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మిథున్ చక్రవర్తి అన్నారు. టీఎంసీకి చెందిన 38…
తమ నేతపై ఎవరైనా ఆరోపణలు చేసినా.. విమర్శలు చేసినా.. వారి ఫాలోవర్స్‌కి ఎంతో కోపం వస్తుంది.. కొన్నిసార్లు అది కట్టలు తెచ్చుకునేవరకు వెళ్తుంది.. అలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ఆ ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది.. అసలే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమని మండుతుంది.. ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడుల వరకు వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. ఏకంగా పార్టీ కార్యాలయాల్లో బాంబుల దాడికి పాల్పడిన ఘటనలు…
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ ఉదంత మరిచిపోక ముందే మరో ఎంపీ కాళీ మాత వివాదంలో చిక్కుకుంది. త్రుణమూల్ కాంగ్రెస్ ఎపీ మహువా మోయిత్రా, కాళీ మాతపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమెను అరెస్ట్ చేయాలంటూ బెంగాల్ బీజేపీ నేతలు మమతా సర్కార్ ను డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఆమెపై కేసులు నమోదు చేశారు. 10 రోజుల్లో పోలీసులు చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వెస్ట్ బెంగాల్…
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున అభ్యర్థిగా బరిలోనికి దిగేందుకు యశ్వంత్ సిన్హా సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా చేసిన ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విపక్షాల తరఫున అభ్యర్థి ఆయనేనా? అని చర్చ జరుగుతోంది. టీఎంసీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. జాతీయ ప్రయోజనాల కోసం, విపక్షాల ఐక్యత కోసం పని చేయడానికి పార్టీ నుంచి బయటకు రావాల్సిన ఈ సమయం తప్పనిసరిగా భావిస్తున్నట్లు…
బీజేపీ పార్టీపై మరోసారి ఫైర్ అయ్యారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తన శరీరంలో రక్తం ఉన్నంత వరకు బెంగాల్ ను విభజన కానివ్వనని కామెంట్స్ చేశారు. మంగళవారం ఉత్తర బెంగాల్ అలీపుర్ దూర్ లో ఆమె పర్యటించారు. ఓట్లు రాగానే బీజేపీ పార్టీ బెంగాల్ ను విభజస్తామని బెదిరిస్తోందని ఆమె ఆరోపించారు. బెంగాల్ విజభన కోసం బీజేపీ డిమాండ్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో ఉత్తర బెంగాల్ అభివృద్ధి…
ఎంతటివారికైనా కొన్నిసార్లు నిరసన తప్పదు.. ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు పి. చిదంబరానికి నిరసన సెగ తాకింది… ఓ కేసులో వాదించేందుకు హైకోర్టుకు న్యాయవాదిగా వెళ్లారు చిదంబరం.. అయితే, ఆయన్ను కాంగ్రెస్ మద్దతుదారులైన న్యాయవాదులు అడ్డుకున్నారు… పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరుకు చిదంబరం కారణమంటూ మండిపడ్డారు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేశారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు.. Read Also: Koratala shiva :…
పశ్చిమ బెంగాల్లో మరోసారి హింస జరిగింది.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింస చోటు చేసుకుంది.. దీనిపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి.. ఇక, ఇప్పుడు బీర్భూం జిల్లా రామ్‌పుర్ హాట్ రాజకీయ హింసపై, అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. పట్టణ శివారులోని బోగ్టూయి గ్రామంలో ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై ఇద్దరు చిన్నారులతో పాటు ఎనిమిది మంది సజీవ దహనం కావడం విషాదం నింపింది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన…
పెగాసస్ వ్యవహారం భారతీయ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది.. పార్లమెంట్ ఉభయసభలను స్థంభించిపోయాయి.. అయితే, పెగాసస్ స్పైవేర్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో సంస్థ నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ స్పైవేర్‌ను తమకు అమ్మేందుకు బెంగాల్ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం కానందున ఆ సంస్థ ఆఫర్‌ను తాము తిరస్కరించామని చెప్పారు దీదీ. నాలుగైదు ఏళ్ల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. పెగాసస్ స్పైవేర్…