పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పరిస్థితులు మరోసారి కాకరేపుతున్నాయి.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి.. బీజేపీ వర్సెస్ టీఎంసీగా పరిస్థితి మారిపోయి.. విమర్శలు, ఆరోపణలు, దాడులు, రైడ్స్, అరెస్ట్‌లు.. ఇలా ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి.. మరోసారి దీదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం ఎక్కడా తగ్గేదే లే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.. తాజాగా, కేంద్ర మంత్రి, బీజేపీ నేత నిశిత్ ప్రమానిక్ చేసిన వ్యాఖ్యలు సంచనలంగా మారాయి.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన 40-45 మంది ఎమ్మె ల్యేలు తమతో (బీజేపీ) టచ్‌లో ఉన్నారని వెల్లడించారు.. అంతేకాదు.. రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణాణాలు చోటు చేసుకోనున్నాయని చెప్పుకొచ్చారు..
Read Also: JP Nadda: దక్షిణాదిపై ఫోకస్.. మరోసారి తెలంగాణకు జేపీ నడ్డా..
ఇక, నిశిత్ ప్రమానిక్ కంటే ముందు మాట్లాడిన బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారికారి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.. అంతేకాదు.. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ త్వరలోనే అరెస్ట్ కాబోతోంది అంటూ సంచలన కామెంట్లు చేశారు. మరోవైపు, 40 మంది టీఎంసీ ఎమ్మె ల్యేలు తమతో సంబంధాలు కలిగిఉన్నారని చెప్పుకొచ్చారు.. కూచ్ బెహర్‌లో నిర్వహించిన ఓ సభలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమానిక్… తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యొక్క పునాదులు “చాలా బలహీనంగా” మారాయని.. 40-45 ఎమ్మెల్యేలు మాతో సన్నిహితంగా ఉన్నారని వెల్లడించడం చర్చగా మారింది.. టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. భవిష్యత్తులో ఏం చేయాలనేది ఆలోచన చేస్తున్నామంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు.. బెంగాల్ రాజకీయాల్లో మరోసారి కాకరేపుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వం తన ఐదేళ్ల కాలపరిమితిని పూర్తి చేయలేదని, 2024 నాటికి బహిష్కరించబడుతుందని అంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచుతున్నాయి.