Ram Navami violence: రామ నవమి పండగ సందర్భంగా పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. రామనవమి ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వడంతో పాటు పలు వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టారు. హౌరా, హుగ్లీ, దల్ఖోలా ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు విచారణ జరిపింది. తాజాగా ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేత దర్యాప్తు చేయించాలని గురువారం ఆదేశించింది.
పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) పార్టీ అగ్రనేత ముకుల్ రాయ్ బిజెపిలో చేరాలని భావిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవాలని ఆయన యోచిస్తున్నారు. బీజేపీలోకి తిరిగి రావడానికి ఆసక్తిగా ఉన్నందున కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవాలనుకుంటున్నట్లు చెప్పారు.
Trinamool's Mukul Roy Is "Missing", Claims Son: తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ రాయ్ మిస్సైనట్లు ఆయన కొడకు పేర్కొన్నాడు. సోమవారం సాయంత్రం నుంచి అతడి జాత లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మాజీ రైల్వే మినిస్టర్ అయిన ముకుల్ రాయ్ కుమారుడు సుభ్రాగ్షు సోమవారం సాయంత్రం మాట్లాడుతూ.. తన తండ్రి మిస్సైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు తన తండ్రిని కాంటాక్ట్ చేయలేకపోయానని, ఆయన జాడ తెలియడం లేదని అన్నారు. ముకుల్ రాయ్ సోమవారం…
పశ్చిమ బెంగాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా శుక్రవారం బీర్భూమ్ చేరుకున్నారు. బెంగాల్లో బీర్భూమ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో టీఎంసీ సర్కారు విమర్శనాస్త్రాలు సంధించారు.
TMC: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ లూయిజిన్హో ఫలేరో తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన టీఎంసీ పార్టీకి కూడా రాజీనామా చేశారు. టీఎంసీ తన జాతీయ పార్టీ హోదాను కోల్పోయినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించిన మరుసటి రోజే ఈ పరిణామం సంభవించింది.
West Bengal: రామ నవమి నుంచి పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. రామ నవమి రోజున ప్రారంభం అయిన మతఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి హౌరాలోని శిబ్ పూర్, కాజీపరా ప్రాంతాల్లో హింస చెలరేగుతోంది. రామ నవమి రోజున శోభాయాత్రపై ఓ వర్గం వారు రాళ్లదాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు వర్గాల మధ్య తీవ్రమైన పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే.
Anurag Thakur: రామ నవమి వేడుకల్లో హౌరా, బెంగాల్ లోని ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ మత ఘర్షణలపై బీజేపీ, త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. ఇదిలా ఉంటే దుర్గాపూర్కు చెందిన వ్యాపారవేత్త, బిజెపి నాయకుడు రాజు ఝా, కొంతమంది సహచరులతో కలిసి కోల్కతాకు వెళుతుండగా, శక్తిగఢ్ ప్రాంతంలోని మిఠాయి దుకాణం వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి చంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ సీఎం మమతా బెనర్జీపై…
Howrah Ram Navami clashes: అనుకన్నట్లుగానే దేశంలోని పలు ప్రాంతాల్లో రామనవమి ఊరేగింపు సమయంలో అల్లర్లు జరిగాయి. గుజరాత్ వడోదరా, మహరాష్ట్ర ఔరంగాబాద్, బెంగాల్ హౌరాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ముఖ్యంగా హౌరాలో ఈ అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పలు వాహానాలకు నిప్పుపెట్టారు. ఇదిలా ఉంటే ఈ అల్లర్లు అధికార త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీల మధ్య తీవ్ర రాజకీయ వివాదంగా మారింది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమిని జరుపుకునే భక్తులు దయచేసి ముస్లిం ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. రామ నవమి ఊరేగింపులను శాంతియుతంగా జరుపుకోవాలని ఆమె అభ్యర్థించారు. రంజాన్ జరుగుతున్నందున ముస్లిం ప్రాంతాలకు దూరంగా ఉండాలని, శాంతియుతంగా పండగ జరుపుకోవాలని, హింసను సృష్టించవద్దని కోరారు. ఊరేగింపుల్లో కత్తుల, చాకులతో వస్తామని కొందరు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, అయితే ఇది క్రిమినల్ నేరం అని మర్చిపోవద్దని, కోర్టులు మిమ్మల్ని…
Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోదీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డీల్ కుదర్చుకున్నారని, ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు ఆమె కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రతిష్టను కంచపరుస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. మమతా బెనర్జీ ఈడీ, సీబీఐ దాడుల నుంచి తనని తాను రక్షించుకోవాలని అనుకుంటోందని అందుకే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.