తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది.. అంటే ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.. కాగా, శ్రీవారి ఆలయంలో 1863లో వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వార దర్శనాన్ని అప్పటి మహంతు సేవాదాస్ ప్రారంభించారు.. ఇక, 1949లో వైకుంఠ ద్వాదశికి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం.. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనానికి క్రమంగా భక్తులు పెరగడడం.. అందిరికీ ఒకేరోజు శ్రీవారి దర్శనం కల్పించడం కష్టమవుతోన్న నేపథ్యంలో.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ.. 2020 ఏడాది నుంచి శ్రీవారి ఆలయంలో పది రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించింది.. దేవతలకు ఒక్క రోజు మానవులుకు 365 రోజులుగా చెబుతారు.. దేవతలకు ఒక్క గంట మానవులుకు 15 రోజులుగా కూడా చెబుతుంటారు.. మహావిష్ణువు ముక్కోటి దేవతలకు 40 నిమిషాలు దర్శన భాగ్యం కల్పిస్తే.. వైకుంఠ ఏకాదశి నుంచి వచ్చే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ.
Read Also: జనవరి 12, బుధవారం దినఫలాలు…