కొద్దిపాటి నిర్లక్ష్యం కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. ఆదివారం ఉదయం తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సి.మల్లవరం సమీపంలో కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రం, ఈరోడ్డు కు చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనానికి కారులో బయలుదేరారు. తిరుపతి జిల్లా, సి.మల్లవరం సమీపంకు చేరుకోగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. 12 ఏళ్ల బాలుడు, ఓమహిళ మృతి చెందారు.
ఈ ఘటనలో తల్లి, కుమారులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మృతులను శరణ్య, మిథున్ లుగా గుర్తించారు. నిద్రమత్తు ప్రమాదానికి కారణం అని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణం అని భావిస్తున్నారు పోలీసులు.