రేపు, ఎల్లుండి సీఎం వైఎస్ జగన్ తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు(సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకోనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. రేపు(సోమవారం) ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. మాడవీధులలో గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు.
తిరుమల మాడవీధులలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆయన వెల్లడించారు.
తిరుపతిలో 20 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన వినాయక సాగర్ను టీటీడీ ఛైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ప్రారంభించారు. స్థానికుల కోరిక మేరకు వినాయక సాగర్ మధ్యలో వినాయక స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని 17 ప్రాంతాలను నిషేదిత జాబితా నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో వాటర్ కోర్స్ పోరంబోకు స్థలాలుగా పరిగణిస్తూ నగరపాలక సంస్థ పరిధిలోని తంబువాని గుంట, కొర్లగుంట, కొత్తపల్లి, చంద్రశేఖర్ రెడ్డి కాలనీ, ఎరుకల కాలనీ, జర్నలిస్ట్ కాలనీ ,కెనడి నగర్, భగత్ సింగ్ కాలనీ , సుంద breaking news, lates news, telugu news, big news, tirupati, bhumana karunakar reddy
టీటీడీ శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది. ఆన్లైన్లో నవంబర్ మాసం టికెట్ల విడుదల షెడ్యూల్ను టీటీడీ విడుదల చేసింది. మరోవైపు లక్కిడిప్ విధానంలో పొందే ఆర్జిత సేవా టికెట్ల కోసం ఇవాళ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.