శ్రీకాళహస్తి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేశాను.. ఎవరికి ఇబ్బంది లేకుండా.. ఆయుధాలు లేకుండా శాంతియుత నిరసన చేపట్టడం రాజ్యాంగం కల్పించిన హక్కు.. సాయి శాంతియుతంగా నిరసన చేపట్టారు.. కానీ, సీఐ రాజ్యంగా విరుద్ధంగా సాయిని కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీవాణి ట్రస్ట్ కి ఇప్పటి వరకు 880 కోట్లు విరాళాలు అందాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయించామన్నారు. 9 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దంపతులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో అద్భుతం జరిగింది. సరోగసీ తల్లి ఆవు ద్వారా మరో ఆవు జన్మించింది. ఏపీలో ఇలా ఆవిష్కృతం కావడం ఇదే తొలిసారి అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. కొత్తగా పుట్టిన ఆవుకు ‘పద్మావతి’గా నామకరణం చేశామన్నారు.
శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది టీటీడీ. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ప్రకటన చేసింది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి పట్టణంలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడం.. మంటలు ఇళ్ల వైపు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Fire Accident: నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి పట్టణంలోని గోవిందరాజ స్వామి దేవాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో... మొదట ఫోటో ఫ్రేమ్ షాపులో మంటలు చెలరేగాయి.