తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోఆరు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉన్న జిల్లా పౌరహక్కుల సంఘం నేత ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఈరోజు తెల్లవారుజామున నుంచి సోదాలు చేపట్టారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు వివిధ వాహనాలపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. చంద్రప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు వివిధ వాహనాలపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు.ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరువీధుల్లో స్వామివారి బంగారు తేరుపై ఊరేగారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు గరుడోత్సవం నేత్ర పర్వంగా మొదలైంది. వైభవంగా శ్రీవారికి గరుడవాహన సేవ మొదలుకాగా.. గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. గోవిందనామాలతో తిరుమలగిరులు మార్మోగుతున్నాయి.
Man Died After Eating Egg Fried Rice in Tirupati : ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కల్తీ ఎక్కువ అయిపోయింది. పాలు దగ్గర నుంచి టీ పొడి, కారాల వరకు ఏదీ స్వచ్ఛంగా ఉండటం లేదు. పాలలో యూరియా కలిపి కల్తీ చేస్తున్న కేటుగాళ్లు, టీ పొడి లాంటి వాటిలో కూడా రంపం పొడి కలిపి విక్రయిస్తున్నారు. ఇక నూనెల కల్తీ గురించి అయితే చెప్పా్ల్సిన పని లేదు. జంతువుల ఎముకల పొడి నూనెలో…
Food Poisoning at KVB Puram in Tirupati: తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఆరె గ్రామంలోని ప్రజలకు ఫుడ్ పాయిజన్ అయింది. ప్రసాదం తిన్న 79 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్తులు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వైద్యశాఖ అధికారులు మెడికల్ క్యాంప్ నిర్వహించి అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందిస్తున్నారు. Also Read: Bus Accident: లోయలో పడిపోయిన బస్సు.. 25 మంది మృతి, 34 మందికి గాయాలు! వినాయక ప్రసాదాన్ని భక్తులు ఆరె…
AP CM Jagan Schedule Today: సోమవారం నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7-8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రోజు సాయంసంధ్యా సమయంలో శ్రీవారి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని…