Nara Bhuvaneshwari: దేవాన్ష్ తన తాతను అడిగాడు.. విదేశాలకు వెళ్లాడని చెప్పాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Bhuvaneshwari: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమం.. ఈ విషయంలో ‘నిజం గెలవాలి’ పేరుతో యాత్రకు పూనుకున్నారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. యాత్రలో భాగంగా పరామర్శలు, ముఖాముఖి కార్యక్రమాలు, సభలు నిర్వహిస్తున్నారు.. ఇక, మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన నారా భువనేశ్వరి.. కొంత భావద్వేగానికి గురయ్యారు.. మనవడు దేవాన్ష్ తన తాత (చంద్రబాబు)ను అడిగాడు.. మేం, విదేశాలకు వెళ్లాడని చెప్పాల్సి వచ్చిందన్నారు.. కుంభకోణం అని చెబుతున్న డబ్బు ఏ అకౌంట్ లోకి వెళ్లింది అని చెప్పడం లేదన్న ఆమె.. ప్రజల సొమ్ము మా కుటుంబానికి అవసరం లేదన్నారు. సీఐడీ ఎప్పుడైనా వచ్చి విచారించుకోవచ్చు అని సూచించారు. ఇక, ములాఖత్ లో మాకు ఇచ్చే సమయం 30 నిమిషాలు.. అందులో 25 నిమిషాలు ప్రజల గురించి, పార్టీ గురించి అడుగుతారు.. మిగిలిన ఐదు నిమిషాలు మాత్రమే మా గురించి మాట్లాడుతారని గుర్తుచేసుకున్నారు.
ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఆయన్ను (చంద్రబాబు) ప్రజలకు దూరం చేయాలని, ఓర్వలేకే ఇలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు భువనేశ్వరి.. తండ్రి నుంచి నాకు కొంత పౌరుషం వచ్చింది.. చంద్రబాబు నుంచి క్రమశిక్షణ, ఓర్పు నేర్చుకున్నానని తెలిపారు. ఎప్పుడూ బయటకు రాని మహిళలు కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అది చంద్రబాబు పై ఉన్న నమ్మకం అన్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల చేసిన లేఖపై కూడా విచారణ అంటే ఆశ్చర్యం వేస్తుందన్న ఆమె.. పనికిమాలిన అంశాలపై విచారణ ఏంటి? ప్రజల సమస్యలు గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని సలహా ఇచ్చారు. మేం చంద్రబాబు ఆహారంలో విషం కలుపుతున్నామని అంటున్నారు.. వారి ఆలోచన అంత హీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.. మాకు ఆ కుసంస్కారం లేదన్న ఆమె.. దేవాన్ష్ తన తాతను అడిగాడు.. విదేశాలకు వెళ్లాడని చెప్పాం అన్నారు. పవన్ కల్యాణ్ కూడా మాలాగానే ఆలోచిస్తున్నారు.. అందుకే రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలన్నారు నారా భువనేశ్వరి..
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
ఇక, ‘ నిజం గెలవాలి ‘ సభలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఒక్కదాన్నే తిరుమల దర్శనానికి వెళ్తే చాలా బాధేసిందన్నారు.. ఇంట్లో నలుగురం నాలుగు దిక్కులు అయ్యాం.. చంద్రబాబు ను జైల్లో పెట్టి ఇప్పటికి 48 రోజులు అవుతోందన్నారు. ఎస్సీ యూనివర్సిటీ నుంచే చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైందని గుర్తుచేసిన ఆమె.. తిరుమలతో పాటు ఇతర పుణ్య క్షేత్రాలను చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు.. ప్రతి జిల్లాను పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దారు.. చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాకు ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చారు.. కానీ, ఇప్పటి ప్రభుత్వం పెట్టిన హింస బరించలేక పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయాయని విమర్శించారు.. అమరరాజా పరిశ్రమ విషయంలో ఇదే జరిగింది.. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా పోయాయన్న ఆమె.. ఐఎస్ బి సంస్థ కోసం చంద్రబాబు ఎంతో కష్టపడ్డారు.. కానీ, భయపెట్టి సంస్థలను వెళ్లగొడుతున్నారనరి ఆవేదన వ్యక్తం చేశారు. హింస, కేసులు, భయపెట్టడంలో ఏపీ నంబర్ వన్ గా మారిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి స్వాతంత్య్రం రావాలని ఇప్పుడు మనం పోరాటం చేస్తున్నాం.. తన కోసం చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి పలకరించమని నాకు చంద్రబాబు చెప్పారు.. ఎవరూ భయపడకండి అంటూ ధైర్యం చెప్పారు నారా భువనేశ్వరి.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు