తిరుపతి జిల్లాలో అనేక చోట్ల బైక్, ఇళ్ళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నా.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి దగ్గర నుంచి నలభై లక్షల రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు
Rishabh Pant, Axar Patel Visits Tirupati Balaji Temple Today: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో ఈ ఇద్దరు స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తితిదే ఆలయ అధికారులు పంత్, అక్షర్కి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం చేసి.. స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం…
కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.. కానీ, ఆ విషయం ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు ? అని నిలదీశారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
తిరుమల పార్వేటి ఉత్సవాల్లో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిలు పాల్గొన్నారు. బాగా పాతదై, కూలడానికి సిద్దంగా ఉన్న పరిస్థితిలో తిరుమల పార్వేటి మండపం స్థానంలో టీటీడీ ప్రాచీన రీతిలో అత్యద్భుతంగా నూతన మండపాన్ని టీటీడీ నిర్మించిందని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులను అలరించేలా 14 రాష్ట్రాల నుంచి కళా బృందాలు విచ్చేస్తున్నట్లు టీటీడీ జేఈవో సదా భార్గవి వెల్లడించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 15 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణ సందర్భంగా సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.