Chinta Mohan: తిరుపతి రాజధాని అవుతుంది.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinta Mohan: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై పలు వాదనలు తెరపైకి వస్తున్నాయి.. అయితే, తిరుపతి రాజధాని అవుతుంది, అవ్వాలని ప్రజలు కోరుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతామోహన్.. సీమలో కరువు పోయి అభివృద్ధి జరగాలంటే తిరుపతి రాజధానిగా మారితేనే సాధ్యం అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన చింతామోహన్.. సీమకు నీళ్లు లేవు.. రాళ్లు మిగిలాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, బ్రహ్మంగారు కాల జ్ఞానంలో తిరుపతి రాజధాని అవుతుందని రాశారు.. అందుకోసం అందరూ ఎదురు చూస్తున్నారని తెలిపారు. తిరుపతి అందరికీ ఆమోద యోగ్యమైన ప్రాంతం.. భూములు, వనరులు, ఆహ్లాదకర మైన వాతావరణం అన్నీ ఉన్నాయని వెల్లడించారు.
Read Also: Breaking: ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అవి రాజ్యాంగ విరుద్ధం..
Also Read
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
మూడు రాజధానులు అని చెప్పిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనటం ఏంటి? అని నిలదీశారు చింతామోహన్.. స్వార్థ ఆర్ధిక ప్రయోజనాల కోసం హైదరాబాద్‌ను విడిచిన చంద్రబాబు.. తుళ్లూరు వచ్చారని విమర్శించిన ఆయన.. భూముల కోసం వైసీపీ.. విశాఖపట్నం వెళ్లిందని ఆరోపించారు. తిరుపతి రాజధాని చేయాలని అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చెప్పినా.. సంజీవయ్య కర్నూలుకి పంపించారని.. ఆ తర్వాత రాజధాని హైదరాబాద్ వెళ్లిందన్నారు. తుళ్లూరు నుంచి విశాఖ వెళ్లిన రాజధాని.. ఇప్పుడు
గాల్లో ఉంది అని ఎద్దేవా చేశారు. మరోవైపు.. రాష్ట్ర రాజకీయాలు భ్రష్ఠు పట్టాయి.. పాకిస్థాన్ కంటే ఘోరంగా ఏపీ పాలిటిక్స్ మారాయని ఫైర్ అయ్యారు. మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కావాలని అన్నీ వర్గాలు కోరుతున్నాయన్నారు. ఇక, వైఎస్ జగన్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.. జగన్ కు ఈ ఎన్నికల్లో 10 సీట్లు లోపు వస్తాయని జోస్యం చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను అర్థరాత్రి చంద్రబాబు కలవాల్సిన అగత్యం ఏంటి? అని నిలదీశారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభ ఘోషిస్తోందన్న ఆయన.. వైఎస్ షర్మిల రావటం వల్ల కాంగ్రెస్ కు లాభం చేకూరింది.. కాంగ్రెస్ మైలేజ్ ను షర్మిల పెంచింది.. షర్మిల ను సీఎంగా చూడాలని ప్రజల్లో ఉంది.. కాంగ్రెస్ 130 స్థానాల్లో గెలుస్తుంది. రెండో స్థానంలో చంద్రబాబు నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతామోహన్.
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!