తిరుపతి నగర జన్మదినోత్సవ వేడుకల పోస్టర్ను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత పుణ్యక్షేత్రం తిరుపతి నగరానికి మాత్రమే ఆవిర్భావ దినోత్సం జరుపుకుంటామని తెలిపారు. 24-02-1130లో నగరానికి జగద్గురు రామానుజాచార్యులు శంఖుస్థాపన చేశారన్నారు. తిరుపతి అంచెలంచెలుగా ఎదుగుతూ మహానగరంగా మారిందని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే తిరుపతి నగరానికి మాత్రమే జన్మదినము ఉందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జన్మదిన పుట్టిన రోజు వేడుకలు చేసుకుందని తిరుపతి వాసులకు పిలుపునిస్తున్నామని చెప్పారు. 24వ తేదీ ఉదయము 9గంటలకు టీటీడీ, తిరుపతి నగరపాలక సంస్థ సహకారంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమం చేద్దాము.. మన తరవాత తరాల వారు దీనిని జరుపుకోవాలని పిలుపునిస్తున్నట్లు భూమన పేర్కొన్నారు.
Read Also: Purandeswari: పొత్తులపై చర్చలకు అధిష్టానం పిలిస్తే కలుస్తాం..
తిరుపతి నగరం క్రీ.శ 1130 లో ఫిబ్రవరి 24న ఆవిర్భవించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అందులో ఈ నగరానికి 1130 ఫిబ్రవరి 24న శంకుస్థాపన చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి. దీంతో ప్రతి సంవత్సరం తిరుపతికి పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారు. సౌమ్య నామ సంవత్సరం ఉత్తరా నక్షత్ర సోమవారం ఫాల్గుణ పౌర్ణమి నాడు రామానుజులు గోవింద రాజులన పీఠాధిపతిని ప్రతిష్టించి తిరుపతిని నిర్మించడం మొదలుపెట్టారట. మొదట దీనిని గోవిందరాజు పట్టణం అని, తర్వాత ఇది చాలా కాలం పాటు రామానుజ పురంగా పిలిచారు. 13వ శతాబ్దం నుండి తిరుపతి గా పిలుస్తున్నారు.ఈ సంవత్సరంలో తిరుపతి నగరం ప్రజలు 894వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు.