Varun Tej: ఓ వైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి, ప్రచారం నడుస్తోన్న వేళ.. ‘ఆపరేషన్ వాలంటైన్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మెగా హీరో వరుణ్ తేజ్.. మార్చి 1వ తేదీన ఆపరేషన్ వాలంటైన్ సినిమా రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్.. ఇక, ఈ రోజు రాజమండ్రిలో పర్యటించిన హీరో వరుణ్ తేజ్.. సినిమా విషయాలతో పాటు ఎన్నికల్లో ప్రచారం.. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యుల పోటీపై క్లారిటీ ఇచ్చారు.
Read Also: Shanmukh Jaswanth Case: గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్, అన్నపై రేప్ కేసు… అసలు కథ ఇదే!
ఎన్నికల్లో పోటీపై మా కుటుంబంలో పెద్దవాళ్ల నిర్ణయమే మా నిర్ణయం అన్నారు వరుణ్ తేజ్.. ఎన్నికల్లో ప్రచారంపై మా కుటుంబంలో పెద్దవారి నిర్ణయమే ఫైనల్ అన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన వరుణ్ తేజ్.. పెద్దనాన్న చిరంజీవి, నాన్న నాగబాబు, బాబాయ్ పవన్ కల్యాణ్ ఏది చెప్తే అదే చేస్తామని అన్నారు. మా అవసరం ఉన్నది అనుకుంటే ఎన్నికల ప్రచారానికి వస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు.. మా కుటుంబం అంతా బాబాయ్ పవన్ కల్యాణ్ వెంటే ఉంటామని పేర్కొన్నారు. అయితే, మేం పొలిటికల్‌గా ఏం చేయాలనుకున్నా పెద్దల నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని వివరణ ఇచ్చారు. ఇక, అనకాపల్లి నుండి నాన్న నాగబాబు పోటీ చేస్తే ప్రచారానికి వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుండి నిహారిక పోటీ చేస్తుందంటూ జరుగుతోన్న ప్రచారంపై క్లారిటీ ఇస్తూ.. ఆ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు వరుణ్ తేజ్.
ఇక, మార్చి 1న ‘ఆపరేషన్ వాలంటైన్ ‘ సినిమా రిలీజ్ చేస్తున్నాం.. మిలటరీమాధవరం వెళ్లి ఆశీస్సులు తీసుకున్నాను అని తెలిపాడు వరుణ్ తేజ్.. ప్రతి సినిమాకు రాజమండ్రి వస్తాను, మాది పక్కనే ఉన్న నిడదవోలు అని గుర్తుచేసిన ఆయన.. సీఆర్పీఎఫ్ బ్యాగ్రౌండ్ లో సినిమా స్టోరీ ఉంటుంది.. పుల్వామా, బాలకోట్ ఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కించాం.. టెర్రరిస్టులను ఎలా మట్టుబెట్టారనేది, మన వారిని ఎలా కాపాడారనేది చూపించాం అని తెలిపారు. లవ్ స్టోరీ, కామెడీ, కర్షియల్ సినిమాలే కాకుండా ఆర్మీ కష్టాలపై సినిమా తీశామని వెల్లడించారు. ఇక, త్వరలో మాట్కా అనే సినిమా చేస్తున్నట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు వరుణ్ తేజ్.