తిరుమలలో రోండోవ పెళ్లికి సిద్దపడిన భర్తను అడ్డుకుంది వరంగల్ కి చెందిన సంధ్య అనే మహిళ.. విడాకులు తీసుకోకూండానే రెండో పెళ్లి చేసుకుంటున్న భర్త రాకేష్ పై పోలీసులుకు పిర్యాదు చేసింది భార్య సంధ్య. దీంతో.. పెళ్లి జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు పోలీసులు.. ఇక ఊహించని ఘటనతో షాక్ తిన్న భర్త రాకేష్.. అక్కడ నుంచి సైలెంట్గా జారుకుని పరారైయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి 41ఏ నోటీసులు ఇచ్చి పోలీసులు విడుదల చేశారు. విదేశాలకు వెళ్లకూడదని షరతులు విధించారు.
టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకోవడం తిరుపతి పద్మావతి నగర్లో కలకలం రేపుతోంది. అన్నమీద కోపంతో ఓ తమ్ముడు.. వదినతో పాటు, వారి ఇద్దరి కూతుళ్లను కిరాతకంగా నరికి చంపిన ఘటన పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్. అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను రేపటి(ఈ నెల 18) నుంచి విడుదల చేయనుంది. రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఆన్లైన్లో అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా నిన్న (మంగళవారం) సాయంత్రానికి క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
Tirupati: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో భారీ ఎత్తున ఉద్యోగుల పదవీ విరమణ చేస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 113 మంది ఉద్యోగుల పదవీ విరమణ చేశారు. ఇద్దరు డిప్యూటి ఈఓ స్థాయి ఉద్యోగులుతో పాటు అటెండర్ స్థాయి ఉద్యోగుల వరకు పదవీ విరమణ చేశారు.
తిరుపతి మరియు చంద్రగిరి ప్రాంతాల్లో గంజాయి ఉపయోగాన్ని పూర్తిగా నిర్మూలించడానికి పోలీసులు కార్యకలాపాలు జరుపుతున్నారు . కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుతం గంజాయి వినియోగం పై ఉక్కుపాదం మోపడంతో జిల్లాలో 49 ప్రాంతాలను గంజాయి విక్రయాల హాట్స్పాట్లా గుర్తించి, పోలీసు వ్యవస్థ 100 రోజుల్లో గంజాయి ఉపయోగాన్ని పూర్తిగా అడ్డుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తున్నారు . ప్రతి పోలీసు స్టేషన్ల పరిధిలో యూత్ మరియు విద్యార్థులు గంజాయి ఉపయోగానికి దూరంగా ఉండటానికి ప్రత్యేక టీమ్లు ఏర్పాటు…