తిరుపతి సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో హైడ్రామా నెలకొంది. కార్యాలయంలో అటెండర్ నానా హంగామా సృష్టించాడు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయాలంటూ మహిళా సబ్ రిజిస్టర్‌పై అటెండర్ దౌర్జన్యానికి దిగాడు. రెండు రోజుల క్రితం పెట్రోల్ పోసుకుని చనిపోతానంటూ డ్రామా నడిపాడు.
Ambati Rambabu: ప్రపంచ వ్యాప్తంగా హిందువులు, తెలుగు ప్రజల మధ్య తిరుమల లడ్డూపై చర్చ జరుగుతుంది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజకీయ కక్షతో చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
తిరుపతిలో సినిమా థియేటర్లో జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. నగరంలోని ఓ సినిమా థియేటర్లో యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. తిరుపతిలోని పీజీఆర్ సినిమా థియేటర్లో ఈ ఘటన జరిగింది.
తిరుపతిలో విద్యార్థులు రెచ్చిపోయారు. నగరంలోని ఓ సినిమా థియేటర్ల యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. తిరుపతిలోని పీజీఆర్ సినిమా థియేటర్లో ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థి లోకేశ్‌ను మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) విద్యార్థిగా గుర్తించారు.
గంజాయి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. కొర్లగుంట మారుతీనగర్ కొత్తపల్లి క్రాస్ వద్ద ఉదయం నిఘా ఉంచి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
SC Railway Special trains: బతుకుదెరువు కోసం చాలామంది వారి సొంత ఊరును వదిలి సిటీలకు వచ్చి జీవనం కొనసాగిస్తుండడం ఈరోజుల్లో పరిపాటుగా మారింది. అయితే ఏదో ముఖ్యమైన పనులు ఉన్న సమయంలో, లేకపోతే ఏదైనా పండుగ సమయంలో సొంత ఊర్లకి వెళ్లేటప్పుడు ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండుగ సమయాల్లో సొంత ఊరికి వెళ్లేందుకు ప్రజలు అధిక రేట్లను వెచ్చించి మరి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా హిందూ పండుగలు అయినా…
తిరుపతిలో కొత్త బస్టాండ్ ఏర్పాటు కానుంది.. ఈ మేరకు బస్టాండ్‌లో పర్యటించింది ఎన్హెచ్ఎల్ ఎం కమిటీ. కమిటీ సీఈఓ ప్రకాష్ గౌర్, ప్రాజెక్టు డైరెక్టర్ పూజా మిశ్రా తో కలిసి ఎంపి గురుమూర్తి పర్యటించారు. బస్టాండ్ ఆవరణలో పర్యటించి పలు అంశాలను వివరించారు ఎంపీ గురుమూర్తి.
Tirumala: వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలన్ని నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.
తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ బాలికల పరిశీలన గృహం(జువైనల్ హోమ్) లో ఉండే బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి నగరంలో అనాథ బాలికలతో పాటు నేర చరిత్ర ఉన్న బాలికల కోసం ప్రత్యేక వసతి గృహం ఉంది. ఈ వసతి గృహంలో ఉండే బాలికలు వివిధ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో గృహంలో ఉంటూ స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ…
పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు పవర్‌ఫుల్‌గా కనిపించారు ఆ వైసీపీ సీనియర్. అబ్బో… ఆయన పరపతి అరచేతి మందం అనుకున్నారు. తండ్రీ కొడుకులిద్దరీ పార్టీ పవర్‌ని బాగానే ఎంజాయ్ చేశారట. కానీ జస్ట్… అలా అధికారం పోయిందో లేదో… ఇలా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శాటిలైట్ సెర్చ్‌లో సైతం దొరకడం లేదన్న సెటైర్స్ పడుతున్నాయి. సాటి సీనియర్స్‌ని ఫిక్స్ చేస్తున్న కేసుల భయం ఆయన్ని కూడా వెంటాడుతోందా? ఎవరా నాయకుడు? ఏంటాయన అజ్ఞాతవాసం కహానీ? భూమన కరుణాకర్‌రెడ్డి, వైసీపీ నేత.…