SC Railway Special trains: బతుకుదెరువు కోసం చాలామంది వారి సొంత ఊరును వదిలి సిటీలకు వచ్చి జీవనం కొనసాగిస్తుండడం ఈరోజుల్లో పరిపాటుగా మారింది. అయితే ఏదో ముఖ్యమైన పనులు ఉన్న సమయంలో, లేకపోతే ఏదైనా పండుగ సమయంలో సొంత ఊర్లకి వెళ్లేటప్పుడు ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండుగ సమయాల్లో సొంత ఊరికి వెళ్లేందుకు ప్రజలు అధిక రేట్లను వెచ్చించి మరి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా హిందూ పండుగలు అయినా దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా కొన్ని పండుగలకు అటు బస్సులు, ఇటు రైలు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయి ఉంటాయి. దక్షిణ మధ్య రైల్వే రాబోయే దసరా, దీపావళి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు తెలియజేసింది. ఈ ప్రత్యేక రైలు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Cloud kitchens: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అందుబాటులోకి క్లౌడ్ కిచెన్లు
దక్షిణ మధ్య రైల్వే దసరా, దీపావళిలకు ఊర్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 24 ప్రత్యేక రైలు సర్వీసులను తీసుక వచ్చింది. ఇందులో భాగంగా అక్టోబరు 5 నుంచి నవంబరు 12 మధ్య ఒక్కోక మర్గంలో 6 ట్రిప్పుల చొప్పున ప్రయాణికులకు అందుబాటులో ఉండబోతున్నట్లు జోన్ సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. ఈ సర్వీస్ లలో సికింద్రాబాద్ – తిరుపతి రైలు అక్టోబరు 5 నుంచి నవంబరు 9 వరకు ప్రతి శనివారం మొదలు కానుంది. తిరుపతి – సికింద్రాబాద్ రైలు అక్టోబరు 8 నుంచి నవంబరు 12 వరకు ప్రతి మంగళవారం నాడు.. అలాగే తిరుపతి – శ్రీకాకుళం రోడ్ రైలు అక్టోబరు 6 నుంచి నవంబరు 10 వరకు ప్రతి ఆదివారం నాడు.. ఇంకా శ్రీకాకుళం రోడ్ – తిరుపతి రైలు అక్టోబరు 7 నుంచి నవంబరు 11 వరకు ప్రతి సోమవారం ప్రయాణం చేయనుంది.