ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం కోసం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనానికి కేవలం 8 గంటల సమయం మాత్రమే పడుతుంది.
CM Chandrababu: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇవాళ (ఆదివారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం కానున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు సీఎంకు నివేదిక అందించనున్నారు.
తిరుపతి సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో హైడ్రామా నెలకొంది. కార్యాలయంలో అటెండర్ నానా హంగామా సృష్టించాడు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయాలంటూ మహిళా సబ్ రిజిస్టర్‌పై అటెండర్ దౌర్జన్యానికి దిగాడు. రెండు రోజుల క్రితం పెట్రోల్ పోసుకుని చనిపోతానంటూ డ్రామా నడిపాడు.
Ambati Rambabu: ప్రపంచ వ్యాప్తంగా హిందువులు, తెలుగు ప్రజల మధ్య తిరుమల లడ్డూపై చర్చ జరుగుతుంది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజకీయ కక్షతో చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
తిరుపతిలో సినిమా థియేటర్లో జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. నగరంలోని ఓ సినిమా థియేటర్లో యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. తిరుపతిలోని పీజీఆర్ సినిమా థియేటర్లో ఈ ఘటన జరిగింది.
తిరుపతిలో విద్యార్థులు రెచ్చిపోయారు. నగరంలోని ఓ సినిమా థియేటర్ల యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. తిరుపతిలోని పీజీఆర్ సినిమా థియేటర్లో ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థి లోకేశ్‌ను మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) విద్యార్థిగా గుర్తించారు.
గంజాయి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. కొర్లగుంట మారుతీనగర్ కొత్తపల్లి క్రాస్ వద్ద ఉదయం నిఘా ఉంచి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
SC Railway Special trains: బతుకుదెరువు కోసం చాలామంది వారి సొంత ఊరును వదిలి సిటీలకు వచ్చి జీవనం కొనసాగిస్తుండడం ఈరోజుల్లో పరిపాటుగా మారింది. అయితే ఏదో ముఖ్యమైన పనులు ఉన్న సమయంలో, లేకపోతే ఏదైనా పండుగ సమయంలో సొంత ఊర్లకి వెళ్లేటప్పుడు ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండుగ సమయాల్లో సొంత ఊరికి వెళ్లేందుకు ప్రజలు అధిక రేట్లను వెచ్చించి మరి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా హిందూ పండుగలు అయినా…