Tirumala Landslides: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది.
AP Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు (బుధవారం) ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
మరో తుపాను గండం పొంచివుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. నేడు మరింత బలపడి, తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఇది తుఫాన్గా మారి.. ఎల్లుండి తీరం దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే టీటీడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈవో శ్యామల రావు అధికారులతో సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల అహంభావం వల్లే సులభంగా విజయం సాధించాల్సిన హర్యానాలో ఆ పార్టీ ఓడిపోయిందన్నారు.
బెంగళూరు వయాలికావల్లోని తిరుపతి తిమ్మప్ప ఆలయం ( టీటీడీ )లో లడ్డూ ప్రసాదం పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు. ఎందుకంటే, బెంగళూరుకు వచ్చే లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. అవును తిరుపతిలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిమ్మప్ప సన్నిధికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది . దీంతో కొండపై నుంచి లడ్డూలు సరఫరా చేసే వాహనాల రాకపోకల్లో తేడా వస్తోంది. అందువల్ల బెంగళూరులోని తిరుపతి దేవస్థానానికి అక్టోబర్ 12 వరకు లడ్డూలను టీటీడీ మేనేజ్ మెంట్ బోర్డు సరఫరా…
రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. భారీగా బోనస్! కేంద్ర మంత్రివర్గం పలు పథకాలకు ఆమోదం తెలిపింది. చెన్నై మెట్రో ఫేజ్ 2కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని., మొత్తం 120 స్టేషన్లతో కూడిన ఈ దశలో కొత్తగా 3 కారిడార్లను నిర్మిస్తామని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ కారిడార్ను చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నిర్మిస్తుంది. దీని మొత్తం వ్యయం రూ.63,246 కోట్లు కాగా, ఇందులో సగం కేంద్రం, మిగితా సగం రాష్ట్రం…
Varahi Declaration: తిరుపతిలో వారహి డిక్లరేషన్ బహిరంగ సభలో సనాతన ధర్మానికి సంబంధించిన డిక్లరేషన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మం పాటించే వారి పట్ల చట్టాలు నిర్ధాక్షిణ్యంగా పని చేస్తాయి..