Varahi Public Meeting: నేడు తిరుపతి వేదికగా వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో వారాహి సభ జరగనుంది.. జ్యోతి రావ్ పూలే సర్కిల్ లో వారాహి బహిరంగ సభ నిర్వహణకు జనసేన, కూటమి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.. అయితే, సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న సభలో వారాహి డిక్లరేషన్ ను ప్రజలకు వివరించనున్నారు పవన్ కల్యాణ్.. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేపట్టిన తొలి సభ కావడం.. వారాహి డిక్లరేషన్ ప్రకటించనుండడంతో.. ఆ డిక్లరేషన్‌లో ఎలాంటి అంశాలు ఉన్నాయి.. పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.. అసలు వారాహి డిక్లరేషన్ ద్వారా పవన్ ఏమి చేబుతారనే అందరిలోను ఆసక్తి రేపుతోంది.. ఇక, ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి భారీగా కూటమి పార్టీల శ్రేణులు హాజరవుతారని చెబుతున్నారు..
Read Also: T20 World Cup 2024: నేటి నుంచే టీ20 ప్రపంచకప్.. తొలి పోరులో బంగ్లాదేశ్‌తో స్కాట్లాండ్ ఢీ!
మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మూడోరోజు తిరుపతిలోనే ఉండనున్నారు. ఇవాళ సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. నిన్న ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన పవన్ కళ్యాణ్, సాయంత్రం తిరుపతిలో వారాహి సభలో పాల్గొంటారు. సా.4 గంటలకు జ్యోతిరావు పూలే సర్కిల్ దగ్గర బహిరంగ సభ జరగనుంది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు. నిన్న తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఆయన.. దీక్షను విరమించారు. శ్రీవారి సేవలో పాల్గొన్న ఆయనకు గొల్ల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. జనసేనానికి టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్ధ ప్రసాదాలు అందించారు. పవన్ తన ఇద్దరు కుమార్తెలు ఆద్య, పొలెనా అంజనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామి వారిని సేవలో పాల్గొన్నారు.