Tirumala: తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది వెళ్తుంటారు. ప్రతిరోజూ శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. సెలవు దినాల్లో అయితే ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది. తిరుమలలో దర్శనం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. ఆ స్వామి ప్రసాదం స్వీకరించడం కూడా అంతే ముఖ్యం. అందుకే శ్రీవారి లడ్డూ తినాలని అందరూ పరితపిస్తుంటారు. దీంతో తిరుమల లడ్డూలకు తీవ్ర డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో తిరుమల లడ్డూలు బుక్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలో…
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తుంటారు.. ఆర్జిత సేవాల్లో పాల్గొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు.. ఆన్లైన్ టికెట్ విధానం వచ్చిన తర్వాత.. భక్తులు టికెట్లను ఆన్లైన్ లోనే బుక్చేసుకుంటున్నారు.. ఇక, ఎప్పుడు అధికారులు టికెట్లను ఆన్లైన్లో పెడతారా? బుక్ చేసుకోవాలా? అని వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు.. ఆ సమయం రానేవచ్చింది.. డిసెంబర్ 12న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేసేందుకు సిద్ధమైంది టీటీడీ.. 2023 జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి…
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. నేను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు.. అయితే, నియోజకవర్గ అభివృద్దికి ఎక్కువ నిధులు తీసుకువచ్చిన వ్యక్తిని నేనే అన్నారు కోమటిరెడ్డి… రాబోవు ఏడాదిన్నర కాలం నియోజకవర్గ అభివృద్ది పైనే దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు.. ఇదే సమయంలో.. కాంగ్రెస్లో కొనసాగుతారా? మరోపార్టీలో…
Droupadi Murmu: ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతోంది. ఆదివారం నాడు నేవీ డే ఉత్సవాల్లో పాల్గొన్న ఆమె సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం.. వరాహ స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి దర్శనానికి ఆలయ మహాద్వారం చేరుకుని అక్కడి నుంచి తిరుమలేశుడి దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆలయ ప్రధాన అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో…
Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనం భక్తులకు కల్పిస్తామన్నారు. పది రోజుల పాటు దర్శన టిక్కెట్లు కలిగిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు. తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శన టోకెన్లు.. ఆన్లైన్ విధానంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారు. రోజుకు 25 వేల…
Tirumala: రుమలలో సరికొత్త రికార్డుల దిశగా శ్రీవారి హుండీ ఆదాయం సాగుతోంది. ఈ వార్షిక ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల హుండీ ఆదాయాన్ని టీటీడీ అంచనా వేయగా.. కేవలం 8 నెలల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.1161.74 కోట్లు నమోదైంది. 8 నెలలుగా ప్రతి నెలా తిరుమల వెంకటేశుడి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ దాటుతోంది. తాజాగా వరుసగా 9వ నెల కూడా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ దాటడం విశేషం.…
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజులు పాటు భక్తులకీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.. సర్వదర్శనం టోకెన్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను భక్తులకు ముందుగానే జారీ చేస్తామని.. సర్వదర్శనం భక్తులకు ఆఫ్ లైన్ విధానంలో ప్రతి నిత్యం 50 వేల టికెట్లు.. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ప్రతి నిత్యం 25 వేలు ఆన్లైన్ కేటాయిస్తామన్నారు. అయితే, వైకుంఠ ద్వారాలు తెరిచే పది రోజులు పాటు టికెట్లు కలిగిన భక్తులకు…
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.. తిరుమలలో ఇవాళ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో.. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు నిర్వహించాలని నిర్ణయించినట్టు.. ఆ సమావేశం ముగిసిన తర్వాత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.. ఇక, పిభ్రవరి 23వ తేదీన బాలాలయ పనులు ప్రారంభిస్తాం.. 6 నెలల కాల పరిధిలో బంగారు తాపడం పనులు పూర్తి చేస్తామన్నారు.. బంగారు తాపడం పనులు నిర్వహిస్తున్న సమయంలో దర్శన విధానంలో…
Tirumala: మరో 35 రోజుల్లో నూతన సంవత్సరం వచ్చేస్తోంది. ప్రజలందరూ 2022కు వీడ్కోలు పలికి 2023కు స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. కావాల్సిన భక్తులకు ఆన్లైన్లో వీటిని అందజేసేలా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్లకు పోస్టు ద్వారా పంపుతామని టీటీడీ వెల్లడించింది. భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో ‘పబ్లికేషన్స్’ అనే ఆప్షన్ను క్లిక్ చేసి డెబిట్కార్డు, క్రెడిట్ కార్డుల…