TTD Mobile App: సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. 20 కోట్ల రూపాయల వ్యయంతో జియో సహకారంతో యాప్‌ను రూపొందించింది టీటీడీ.. యాప్ ఏర్పాటుకు అయిన వ్యయాని టీటీడీకి జియో సంస్థ ఉచితంగా అందించింది.. ఇవాళ ఆ కొత్త యాప్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు.. తిరుమల తిరుపతి దేవస్థానం యాప్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వున్న భక్తులు టీటీడీ సేవలు పొందవచ్చు అని తెలిపారు చైర్మన్…
Rathasapthami 2023: తిరుమలలో రేపు రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.. రథసప్తమి వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒకేరోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీవారి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి.. ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనం, ఉదయం 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు…
Tirumala: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అంగప్రదక్షిణం కోటా టోకెన్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోని భక్తులు ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అంగప్రదక్షిణం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తడిబట్టలతోనే వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్‌లోని క్యూ వద్దకు చేరుకోవాలి. అక్కడ టికెట్, ఐడీని చెక్ చేసిన…
Tirumala: ఈ మధ్య తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న టీటీడీ.. బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలకు సిద్ధం అవుతుంది..? వైరల్ అయిన వీడియో నిజమా? లేదా ఫేక్‌దా అనేది తేలాల్సి ఉన్నా.. ఈ ఘటనతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది.. శ్రీవారి ఆలయ డ్రోన్ దృశ్యాల వ్యవహారంపై స్పందించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. తిరుమలలో డ్రోన్…
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలలో డ్రోన్ కెమెరా వ్యవహారం కలకలం రేపుతోంది.. శ్రీవారి ఆలయం గగనతలంపై డ్రోన్ కెమెరాలకే కాదు విమానాలకు కూడా అనుమతి లేదు.. కానీ, తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియోలో శ్రీవారి ఆలయం పరిసరాలు విహంగ వీక్షణంలో స్పష్టంగా కనిపించడం ఆందోళన కలిగించే విషయం.. ఈ వ్యవహారం ఒక్కసారిగా టీటీడీ అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు.. డ్రోన్ కెమెరాల్లో శ్రీవారి ఆలయాలను చిత్రీకరించిన సదరు…
Tirumala: తిరుమలలో డ్రోన్ కెమెరాలపై నిషేధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో తిరుమలలో డ్రోన్ కెమెరాలు ఎలా వినియోగించారని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరాలు ఎగరవేసినా విజిలెన్స్ విభాగం గుర్తించలేని స్థితిలో ఉందని పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలోని ఇన్ స్టాగ్రామ్ పేజీ ఐకాన్ అనే అకౌంట్ నుండి…
TTD EO Dharma Reddy: తిరుమలలో వసతి గదుల అద్దె పెంపుపై పెద్ద దుమారమే రేగుతోంది.. దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమానికి సిద్ధం అవుతోంది.. వెంటనే పెంచిన అద్దెలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు.. అయితే, గదుల ధరల పెంపు విషయంలో రాజకీయం చేయడం చాలా బాధాకరం అన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. అసలు అద్దె ఏ గదులకు పెంచామనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.. తిరుమలలో మొత్తం 7500 గదులు, నాలుగు…