Tirumala: టీటీడీ కీలక నిర్ణయం.. తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: ఈ మధ్య తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న టీటీడీ.. బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలకు సిద్ధం అవుతుంది..? వైరల్ అయిన వీడియో నిజమా? లేదా ఫేక్‌దా అనేది తేలాల్సి ఉన్నా.. ఈ ఘటనతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది.. శ్రీవారి ఆలయ డ్రోన్ దృశ్యాల వ్యవహారంపై స్పందించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. తిరుమలలో డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్‌కు పర్మిషన్ ఇచ్చింది వాస్తవం.. అన్నదానం వద్ద నుండి డంపింగ్ యార్డ్ వరకు వారికి డ్రోన్ సర్వేకు పర్మిషన్ ఇచ్చాం అన్నారు. టీటీడీలో భద్రతకు ఎక్కడా రాజీ పడటంలేదు.. టీటీడీ దగ్గర హై సెక్యురీటీ వ్యవస్థ ఉందన్నారు.. ఇక, త్వరలో తిరుమలకు యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకొస్తున్నామని ప్రకటించారు ధర్మారెడ్డి.
Also Read
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
- AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
- AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
- CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
ఇప్పటికే డ్రోన్ల వ్యవహారంపై కేసు నమోదు చేశాం.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈవో.. వైరల్ అయినా వీడియోలు నిజమైనవా లేక ఫేక్ వీడియోలా అని తేలాల్సి ఉందన్న ఆయన.. డ్రోన్ ఆపరేటర్ లు అత్యుత్సాహంతో వీడియోలు తీసుంటే చర్యలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు.. ఫేక్ వీడియోలైతే ఏం చేయలేం.. కానీ, నిజమైన వీడియోలే అయితే చర్యలు తప్పవన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. మరోవైపు.. శ్రీవాణి ట్రస్టు నిధులు దారి మళ్లుతున్నాయనే ప్రచారంపై స్పందించిన ఆయన.. శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటి వరకు రూ.650 కోట్ల నిధులు సమకూరాయి.. దేవాదాయశాఖ ద్వారా 932 ఆలయాలు నిర్మాణంలో ఉన్నాయి.. దేవాదాయశాఖ నిర్మిస్తున్న ఆలయాలకు శ్రీవాణి ట్రస్ట్ నుండి రూ.100 కోట్లు కేటాయించాం.. ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామన్నారు.. 647 ఆలయాలకు వినతులు వచ్చాయి.. శిథిలావస్థలో ఉన్న ఆలయాలకు రూ.130 కోట్లు కేటాయించాం.. శ్రీవాణి ట్రస్టుకు ప్రత్యేక అకౌంట్ ఉంటుంది.. జనరల్ అకౌంట్ కు శ్రీవాణి ట్రస్టు నిధులు వచ్చే అవకాశంలేదని. శ్రీవాణి ట్రస్టు నిధులు 50 శాతం టీటీడీ జనరల్ అకౌంట్ కు వెళ్తున్నాయనేది అవాస్తవమని స్పష్టం చేశారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
-
MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!