Tirumala: డ్రోన్ వీడియో ఫేక్.. అది పాత వీడియో అన్న ఈవో ధర్మారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమలలో డ్రోన్ కెమెరాలపై నిషేధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో తిరుమలలో డ్రోన్ కెమెరాలు ఎలా వినియోగించారని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరాలు ఎగరవేసినా విజిలెన్స్ విభాగం గుర్తించలేని స్థితిలో ఉందని పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలోని ఇన్ స్టాగ్రామ్ పేజీ ఐకాన్ అనే అకౌంట్ నుండి అప్ లోడ్ అయింది. అయితే ఈ వీడియో టీటీడీ దృష్టికి వెళ్లింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలు చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Ranji Trophy: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 42 ఏళ్ల తర్వాత ముంబైపై ఢిల్లీ విజయం
Also Read
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
అయితే ఈ డ్రోన్ వీడియోను హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు తీసినట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో వీడియోను అప్‌లోడ్ చేసిన వారిని అదుపులోకి తీసుకు విచారిస్తామని చెప్పారు. ఇప్పటికే నిందితులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అటు ఈ వీడియోపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అది ఫేక్ వీడియో అని స్పష్టం చేశారు. తిరుమలలో డ్రోన్‌లకు అసలు అనుమతి లేదని అన్నారు. తిరుమల ఎప్పుడూ సాయుధ బలగాల పర్యవేక్షణలో ఉంటుందని వెల్లడించారు. శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగురవేయడం అసాధ్యమని తెలిపారు. బహుశా అది 3డీ ఇమేజ్ లేదా గూగుల్ లైవ్ వీడియో అయ్యి ఉండొచ్చని ధర్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ వీడియోను తెరపైకి తీసుకురావడం టీటీడీపై బురదజల్లే ప్రయత్నమేనని అన్నారు. పాత వీడియోను పట్టుకుని ఇప్పుడు జరిగిందని ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇదే అంశంపై టీటీడీ సీవీఎస్‌వో నరసింహ కిషోర్ కూడా స్పందించారు. శ్రీవారి ఆలయానికి సంబందించిన ఈ వీడియోను డ్రోన్ కెమెరాతో తీశారా లేదా గూగుల్ నుండి సేకరించారా అన్నది ఫోరెన్సిక్‌కు పంపి నిర్ధారణ చేసుకుంటామని చెప్పారు.
తాజావార్తలు
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
-
Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
-
CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?