తిరుమల తిరుపతి పాలకమండలి పదవీకాం రేపటితో ముగుస్తుంది. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమలలో ఇవాళ చివరి సమావేశం జరుగనుంది. టీటీడీ కొత్త ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని ప్రభుత్వం ఇప్పటికే నియమిస్తూ జీవో జారీ చేసింది.
Story Board: శ్రీవారి భక్తులకు సేవలందించడంతో పాటు.. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టిటిడి అనేక ట్రస్ట్ లను ప్రారంభించింది.అందులో ప్రధానమైనవి.. అన్నప్రసాద ట్రస్ట్, ప్రాణదాన ట్రస్ట్, గోసంరక్షణ ట్రస్ట్,వేదపరిరక్షణ ట్రస్ట్. వీటిని ప్రారంభించి ముప్పైకి పైగా సంవత్సరాలు పూర్తి అవుతున్నా..ఒక్క అన్నప్రసాద ట్రస్ట్ కి మాత్రమే ఇప్పటి వరకు 1600 కోట్లు విరాళాలు అందాయి.మిగిలీన ట్రస్ట్ లకు ఇప్పటి వరకు అందిన విరాళాలు వంద కోట్ల రూపాయలకే పరిమితం.మరో వైపు శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభించి ఇంకా…
శ్రీవాణి ట్రస్ట్ కి ఇప్పటి వరకు 880 కోట్లు విరాళాలు అందాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయించామన్నారు. 9 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. మహాద్వారం వద్ద స్వామివారి హుండీ పడిపోయింది. ఆలయం నుంచి శ్రీవారి హుండీని లారీలో పరకామణి మండపానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.