జాన్వీ కపూర్.. ఈ భామ అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో కి ఎంట్రీ ఇచ్చింది.ఈ భామ వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్ పాత్రల తో పాటు నటనా ప్రాధాన్యత గల పాత్రలు కూడా ఈ భామ చేసింది. రీసెంట్ గా జాన్వీ కపూర్ వరుణ్ ధావన్ సరసన బవాల్ అనే చిత్రంలో నటించింది. జూలై 21న డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.అయితే జాన్వీ కపూర్ తన తల్లి వలె సౌత్ ఇండస్ట్రీ లో కూడా హీరోయిన్ గా రానించాలని ఎంతగానో ఆశ పడింది. దీనితో ఈ భామకు సౌత్ లో భారీ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమానే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర మూవీ. ఈ సినిమాను సముద్రతీర ప్రాంతంలో నరరూప రాక్షసుల లాంటి వారిని ఎదుర్కొనే యాక్షన్ డ్రామాగా దర్శకుడు కొరటాల చిత్రీకరిస్తున్నాడు.ఈ సినిమాలో ఈ అమ్మడి పాత్ర అద్భుతంగా ఉంటుందని సమాచారం.
వరుస సినిమాలతో బిజీ గా వున్నా కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం తన సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ తో పాటు తన హాట్ ఫొటోస్ నీ కూడా షేర్ చేస్తుంటుంది.ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ తాజాగా సాంప్రదాయ బద్దంగా లంగా ఓణిలో మెరిసింది..భక్తి పారవశ్యంతో నేటి ఉదయం జాన్వీ కపూర్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంది. నెలల వ్యవధిలో జాన్వీ కపూర్ శ్రీవారిని దర్శించుకోవడం ఇది రెండవసారి అని తెలుస్తుంది..కొన్ని నెలల క్రితం జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలసి తిరుమల శ్రీవారినీ సందర్శించింది.తన తల్లి శ్రీదేవిలాగే జాన్వీ కపూర్ తరచుగా శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటుంది.. తాజాగా జాన్వీ బ్లూ లంగా ఓణిలో లో ఆలయం ఎదుట కనిపించింది. విఐపి బ్రేక్ దర్శనంలో జాన్వీ కపూర్ కి అధికారులు దర్శనం కల్పించారు. అలాగే అర్చకులు ఆమెకు శ్రీవారి ప్రసాదం అందజేశారు.జాన్వీ కపూర్ తిరుమల సందర్శించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.