Srisailam: తిరుమల చిన్నారిపై చిరుత దాడి ఘటన నేపథ్యంలో శ్రీశైల దేవస్థానం అలర్ట్ అయింది. క్షేత్ర పరిధిలో చిరుతల సంచారంపై దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత, ఎలుగుబంటి వన్యప్రాణుల సంచారంపై అటవీశాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
Read Also: Gun Found: మూడేళ్ల బాలిక స్కూల్ బ్యాగ్‌లో తుపాకీ లభ్యం.. తండ్రి అరెస్ట్
రాత్రి సమయంలో జంతువులు క్షేత్ర పరిధిలోకి రాకుండా టపాసులు కాలుస్తూ శబ్దాలు చేయిస్తామని శ్రీశైలం దేవస్థాన ఈవో లవన్న పేర్కొన్నారు. త్వరలో భక్తుల రక్షణకై అడవి జంతువులు క్షేత్రపరిధిలోకి రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. పెన్సింగ్ కోసం మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి సహకారంతో రూ. 5 కోట్ల 30 లక్షలకు టెండర్ పిలుస్తామని ఆయన తెలిపారు. 2 సంవత్సరాలలో పెన్సింగ్ ఏర్పాటు చేసి జంతువులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రానికి వచ్చే భక్తులకు రక్షణ కల్పిస్తామని ఈవో లవన్న స్పష్టం చేశారు.