TTD EO Dharma Reddy: నిజం నిద్ర లేచే లోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందట.. ఇప్పుడు సోషల్ మీడియాలో పరిస్థితి కూడా అలాగే తయారైంది.. ఏది వైరల్, ఏది రియల్.. ఏది నిజం.. ఏది అబద్ధం అని నమ్మేపరిస్థితి లేకుండా పోయింది. తాజాగా, టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. టీషర్ట్ ధరించిఉన్న ఆయన.. ఉద్యోగ సంఘాల నేతల నుంచి ఓ వినతిపత్రాన్ని అందుకుంటున్నారు.. టీటీడీ ఈవోగా ఉన్న వ్యక్తి సంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించకుండా.. టీషర్ట్ ధరించడం ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి.. అయితే, ఆ ఫొటో వెనుక ఉన్న అసలు విషయాన్ని వివరిస్తూ.. సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు ఉద్యోగ సంఘాల నేతలు..
కోవిడ్ సమయంలో వైద్య చికిత్సలు అందక, ఆక్సిజన్ సిలిండర్లు దోరకక, ఆస్పత్రుల్లో కనీసం బెడ్‌లు కూడా దోరకక ఇబ్బందులు పడుతున్న సమయంలో, టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు అయిన మేం ఒక రోజు సుమారు రాత్రి 10 గంటల సమయంలో హుటాహుటిన తిరుమలలోని అదనపు కార్యనిర్వాహణాధికారి అయినటువంటి ఏవీ ధర్మారెడ్డి.. క్యాంపు కార్యాలయానికి వెళ్లాం.. సీసీ ద్వారా కబురు పంపడంతో ఆయన హుటాహుటిన కిందకు వచ్చి, యూనియన్ నాయకుల సమస్యలను తెలుసుకుని వెంటనే స్పందించారని తెలిపారు.. టీటీడీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్.. ఇక, రెండేళ్ల క్రితం మేం ఇచ్చిన వినతిపత్రం తీసుకున్నప్పటి చిత్రాన్ని చూపించి.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు.. దీనిని ఉద్యోగ సంఘ నాయకులుగా మేం తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.
ఇక, ఇది ఇప్పటికే చాలాసార్లు టీటీడీ వారు కూడా ఖండించారు.. ఇలా దుష్ప్రచారం చేసే వారిపై అప్పట్లో ఫిర్యాదు కూడా చేసింది టీటీడీ సైబర్ సెక్యూరిటీ విభాగం. కానీ, మళ్లీ అదే చిత్రాన్ని చూపిస్తూ సామాజిక మాధ్యమంలో దుష్ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా ప్రారంభ సమయంలో అర్చకులు కోవిడ్ భారిన పడితే వారికి దగ్గరుండి వైద్యసేవలు అందించేలా, వారికి ప్రత్యక్షంగా ధైర్యం చెప్పేందుకు కోవిడ్ వార్డులో తిరిగిన అధికారి ఎవరైనా వున్నారంటే అది ఒక్క ధర్మారెడ్డి మాత్రమే అని విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.. తనను నమ్మి వచ్చిన ఉద్యోగులును ఆదుకునేందుకు వారితో చర్చించి, తర్వాత రోజే టీటీడీ బర్డ్ హస్పిటల్స్ లో ఉద్యోగులకు ప్రత్యేకంగా వైద్య చికిత్సలు అందించేలా, తన సొంత పలుకుబడితో దాతల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు సేకరించిన ఆపద్బాందవుడు ఈవో ధర్మారెడ్డి.. ప్రాణాలు పోతున్న సమయంలో.. తమను ఆదుకోవాలంటు అర్ధరాత్రి ఇంటి తలుపు తట్టిని ఉద్యోగులను ఆదుకునేందుకు వచ్చిన సమయంలో అధికారి సూటుబూటు వేసుకోని వస్తారా? అంటూ ఉద్యోగ సంఘాల నేతల ఫైర్ అవుతున్నారు.. ఈ చెత్త విమర్శలు చేసే వెధవలకు నా సూటి ప్రశ్న, మీరు ఇంటిలో నిద్రించే సమయంలో ప్యాంట్, షర్ట్, సూట్ బూట్ తో నిద్రపోతారా? లేదా లుంగీ, నైట్ డ్రెస్ లతో నిద్రపోతారా? అని ప్రశ్నించారు.
కోవిడ్ కాలంలో సాయంత్రమైతే ఇంటి తలుపులు మూసివేసి.. గడియపెట్టుకోని మేం బాగుంటే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్న కాలంలో, ఉద్యోగులు కోసం రాత్రి 10 గంటల సమయంలో వారిని సాధరంగా ఆహ్వానించి.. వారి సాధకభాధలు విని, వారికి దైర్యం చెప్పి, వారిలో భరోసా నింపేలా చర్యలు తీసుకున్న అధికారి. ఆ సమయంలో స్పందించిన తీరుని అభినందించాలా లేక మీరు కోరినట్టు తర్వాత రోజు సూట్ బూట్ వేసుకోని వచ్చేవరకు వారిని ఆగమని చెప్పాలా? అని ఎద్దేవా చేశారు. ఇవన్ని ప్రక్కన పెడితే కోవిడ్ కాలంలో తీసుకున్న ఫొటోను ఇప్పుడే మీరు తీసినట్టుగా ప్రచారం చేస్తూన్నారంటే, మీ పిచ్చితన్నాని, కపటబుద్ధిని, మీ దిగజారుడుతన్నాని ఎమనాలి? ఇదే అంశంపై గతంలో మేం సవీవరంగా వివరణ ఇచ్చినా, మీ కుటీల మనసత్వం వాటిని దాచి పెట్టి అబద్ధాలను ప్రచారం చేస్తూంటే దానిని ఏమనాలి?.. మీరు ఎన్ని గ్లోబల్స్ ప్రచారం చేసినా, స్వామివారి భక్తులు మీ చెత్త కథలను నమ్మరు అనే విషయాని గుర్తించుకోని, మీ దుష్ప్రచారాలు, అసత్య ప్రచారాలు, వక్రబుద్దిని మార్చి మీకు మంచి బుద్దిని ప్రసాద్దించాలని ఆ శ్రీవారిని ప్రార్ధిస్తున్నామని పేర్కొన్నారు టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు చీర్ల కిరణ్, A. వాసు, B. హేమలత.