TIRUMALA: తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరుని ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలాంటిది బ్రహోత్సవాలల్లో దర్శించుకునే భాగ్యం కలిగితే ఇంకెంత పుణ్యమో అనుకుంటారు. అయితే ప్రతి ఏడాది లాగా కాకుండా.. ఈ ఏడాది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి రెండు బ్రహోత్సవాలు జరగనున్నాయి. అధికమాసం రావడంతో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహోత్సవాలను నిర్వహించనున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై శ్రీవెంకటేశ్వర స్వామికి ఈ ఏడాది రెండు బ్రహోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ నెలలో ఒక బ్రహోత్సవం జరగనుండగా.. అక్టోబర్‌లో నవరాత్రి బ్రహోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 16వ తేది వరకు సాలకట్ల బ్రహోత్సవాలు జరగనుండగా.. అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి బ్రహోత్సవాల తేదిలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. తిరుమల శ్రీనివాసుడికి ఈఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈఏడాది అధికమాసం సందర్భంగా సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా సెప్టెంబరు 18న ధ్వజారోహణం, 22న గరుడవాహన సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం(మహారథం), 26న చక్రస్నానం, ధ్వజావరోహణం ఉంటాయని టీటీడీ ప్రకటించింది.
Read also: Asia Cup 2023: అభిమానులకు శుభవార్త.. ఉచితంగానే ఆసియా కప్ మ్యాచ్‌లు చూడొచ్చు!
ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 19న గరుడవాహనం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం ఉంటాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీవరకు, అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు అష్టదళపాద పద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకార, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్నవారికి, నిర్దేశిత వాహన సేవలకు మాత్రమే అనుమతించనున్నట్టు టీటీడీ స్పష్టం చేసింది. నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కారణంగా అక్టోబర్ 14న సహస్రదీపాలంకార సేవను రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.