తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి దర్శనం కోసం దాదాపు 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, స్వామివారి దర్శనానికి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.
తిరుమల తిరుపతిలో కిడ్నాప్ కలకలం రేపుతుంది. తిరుమల ఆర్టీసీ బస్టాండ్ లో రెండేళ్ల బాబు కిడ్నాప్ కు గురయ్యాడు. రాత్రి రెండు గంటల సమయంలో రిజర్వేషన్ కౌంటర్ దగ్గర కిడ్నాప్ చేశారు. అయితే, శ్రీవారి దర్శనానికి చెన్నైకి చెందిన కుటుంబం వచ్చింది.
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సంవత్సరం అధికమాసం వచ్చినందున రెండుసార్లు బ్రహ్మోత్సవాలను జరపాలని ఇప్పటి వరకే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసింది.
తిరుమల కొండపైన భక్తుల రద్దీ భారీగా పెరుగుతుంది. వరుస సెలవులు ఉండటంతో ఒక్కసారిగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో పూర్తిగా నిండిపోయి క్యూలైన్ దాదాపు కిలో మీటరు మేరకు శిలాతోరణం వరకు భారీగా వేచి ఉన్నారు.
టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. బుధవారం విఐపి దర్శనం సమయాల్లో ఈ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు.. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో గంభీర్ పాల్గొన్నాడు.టీటీడీ అధికారులు గంభీర్ దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను అందించారు.. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు గౌతీని సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన…
Chakra Snanam Completed in Tirumala Salakatla Brahmotsavam 2023: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం పుష్కరిణిలో శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి ఈ వేడుకలో పాల్గొన్నారు. అంతకుముందు శ్రీవారు, ఉభయదేవేరులు, చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు టీటీడీ అధికారులు అనుమతించారు. Also Read: Swara Bhasker Baby: తల్లైన బాలీవుడ్…
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు వివిధ వాహనాలపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. చంద్రప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఏడవ రోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా.. ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులుకు మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు