రేపు, ఎల్లుండి సీఎం వైఎస్ జగన్ తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు(సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకోనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. రేపు(సోమవారం) ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. మాడవీధులలో గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు.
తిరుమల మాడవీధులలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆయన వెల్లడించారు.
చంద్రబాబుకి శిక్షపడాలని అందరూ కోరుకున్నారు అని అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకి శిక్షపడడంతో మ్రొక్కులు చెల్లించుకున్నాను అని ఆమె పేర్కొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ లో చంద్రబాబుకి పూర్తిస్థాయిలో భధ్రతా ఏర్పాట్లు కల్పించామని మంత్రి రోజా అన్నారు.
బాలివుడ్ బాద్షా హీరో షారుఖ్ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం జవాన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.. ఈ క్రమంలో షారుఖ్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన ఆయన శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.. తన కూతురు సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.…