టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి తిరుపతి చేరుకున్నారు. ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో తమ కులదేవతకు పూజలు చేయనున్నారు. నారా భువనేశ్వరి రేపటి నుంచి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు. చంద్రబాబు అరెస్ట్ వార్త విని ఆవేదనతో చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
Read Also: Gold Price Today : పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
ఇక, రేపు ( బుధవారం ) నారావారిపల్లి నుంచి నిజం గెలవాలి బస్సు యాత్ర స్టార్ట్ కానుంది. ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో పల్లె ప్రజలతో నారా భువనేశ్వరి సహపంక్తి భోజనం చేయనున్నారు. చంద్రగిరి మండలంలోని అగరాల బహిరంగసభలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆమె మాట్లాడనున్నారు. అనంతరం తిరుపతిలోను భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన-టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు సంబంధించి ఈనెల 26న తిరుపతిలో వారిని పరామర్శించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తిరుపతిలో జరిగే బహిరంగసభలోను ఆమె ప్రసంగిస్తారు.
Read Also: Kangana Raunat : ఢిల్లీలో రావణ దహనం చెయ్యనున్న తొలి మహిళా సెలెబ్రేటి..
అయితే, నారా భువనేశ్వరి కూడా చంద్రబాబు నాయుడి సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. చంద్రబాబు టీడీపీ తరఫున ఏదైనా కొత్త కార్యక్రమం చేపట్టినా, ఎన్నికల ప్రచారమైనా సొంత జిల్లా నుంచే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు భువనేశ్వరి కూడా కుప్పం నుంచి నిజం గెలవాలి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అంతేకాదు టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా యువగళం పాదయాత్ర కుప్పం నుంచే ఆరంభించారు.