యాంకర్ గా బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.. ఈ మధ్య బుల్లితెరపై పెద్దగా కనిపించలేదు.. సినిమాల పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. అడపాదడపా వెండితెరపై మెరుస్తూ ఆకట్టుకుంటుంది.. నిధానంగా ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుని రాణిస్తుంది. ఇటీవల రెండు చిత్రాలతో మెరిసిన ఈ భామ మరిన్ని సినిమాలతో ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..…
చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. తిరిగి రేపు వేకువజామున 3:15 గంటలకు ఆలయ తలుపులను అర్చకులు తెరవనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ.. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేసాం.. రేపు ఉదయం ఆలయ తలుపులు తెరిచి శుద్ది చేస్తారు.
తిరుమల పార్వేటి ఉత్సవాల్లో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిలు పాల్గొన్నారు. బాగా పాతదై, కూలడానికి సిద్దంగా ఉన్న పరిస్థితిలో తిరుమల పార్వేటి మండపం స్థానంలో టీటీడీ ప్రాచీన రీతిలో అత్యద్భుతంగా నూతన మండపాన్ని టీటీడీ నిర్మించిందని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. జనవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నేడు టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి భక్తులు సులువుగా దర్శించుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ప్రతి నెల టీటీడీ రిలీజ్ చేస్తుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి తిరుపతి చేరుకున్నారు. ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో తమ కులదేవతకు పూజలు చేయనున్నారు. నారా భువనేశ్వరి రేపటి నుంచి 'నిజం గెలవాలి' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. భక్తులు శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 77,187 మంది భక్తులు దర్శించుకున్నారు. 29, 209 మంది తలనీలాలు సమర్పించారు.
తిరుమలలో నకిలీ ఈడీ కమీషనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన సార్ట్ వేర్ ఇంజినీర్ వేదాంతం శ్రీనివాస భరత్ భూషణ్ గా పోలీసులు గుర్తించారు.
Tirumala Brahmotsavam 2023 ends on Monday: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదోవ రోజు కొనసాగుతోంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి విశేష సమర్పణ చేసిన అనంతరం స్వర్ణ రథంలో ఊరేగించారు. గరుడ సేవ తర్వాత రథోత్సవానికే అంతటి ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఉదయం స్వర్ణ రథంపై అధిష్ఠించిన స్వామికి భక్తులు నీరాజనాలు పలికారు. నేడు రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య వాహన…