తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు వివిధ వాహనాలపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు.ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరువీధుల్లో స్వామివారి బంగారు తేరుపై ఊరేగారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు గరుడోత్సవం నేత్ర పర్వంగా మొదలైంది. వైభవంగా శ్రీవారికి గరుడవాహన సేవ మొదలుకాగా.. గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. గోవిందనామాలతో తిరుమలగిరులు మార్మోగుతున్నాయి.
తాజాగా తిరుమలలో ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించారు సెక్యూరిటీ సిబ్బంది. వివరాలలోకి వెళ్తే.. నిన్న రాత్రి 12:30 గంటల సమయంలో అలిపిరి నడక మార్గంలోని నరసింహ స్వామి ఆలయం వద్ద ఫుట్ పాత్ పై ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు.
AP CM Jagan Schedule Today: సోమవారం నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7-8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రోజు సాయంసంధ్యా సమయంలో శ్రీవారి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని…
రేపు, ఎల్లుండి సీఎం వైఎస్ జగన్ తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు(సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకోనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. రేపు(సోమవారం) ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. మాడవీధులలో గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు.