ఇవాళ్టి నుంచి తిరుమలలో ధనుర్మాసం ప్రారంభం అయింది. దీంతో నేటి రేపటి నుంచి జనవరి 14వ తేది వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. నెల రోజులు పాటు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైతో స్వామివారికి మేల్కోలుపు ఉండనుంది.
తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 2024 మార్చి నెలకు సంబంధించి ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దీంతో శ్రీవారి భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచివున్నారు. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. కాగా, నిన్న శ్రీనివాసుడిని 71,037 మంది భక్తులు దర్శించుకున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఆధ్యాత్మిక బాటలో నడుస్తుంది.. ఇటీవల పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ వస్తుంది.. తాజాగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడం కోసం గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం ద్వారా గోవింద నామ స్మరణ చేస్తూ సామాన్య భక్తులతో కలిసి తిరుమల కొండపైకి చేరుకున్నారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.. మూడున్నర గంటల పాటు నడుచుకుంటూ దీపికా పదుకొణె తిరుమలకు చేరుకున్నారు. మెట్ల మార్గంలో నడుచుకుంటూ వస్తున్న దీపికా…
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. 2023, డిసెంబర్ నెలలో జరిగే ఉత్సవ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నరేంద్ర మోడీ. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. ఆలయ మహాద్వారం వద్ద ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య ప్రధాని నరేంద్ర మోడీ తిరుమలలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనకు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లలో 2 వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. తిరుమల అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు.
శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన టికెట్లను ఈ రోజు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. వచ్చే ఏడాది అంటే 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ రోజు విడుదల చేయనున్నారు.. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ..
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి రేపు(నవంబర్ 24) ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చెయ్యనున్నట్లు టీటీడీ ప్రకటించింది.