TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన టికెట్లను ఈ రోజు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. వచ్చే ఏడాది అంటే 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ రోజు విడుదల చేయనున్నారు.. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. మరోవైపు.. తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు.. భక్తులు www.tirumala.org వెబ్సైట్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో పాటు గదులను కూడా బుక్ చేసుకోవచ్చు.. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. 31 కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.. మరోవైపు.. నిన్న శ్రీవారిని 45,503 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,096 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. ఇక, హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.
Read Also: Delhi Air Pollution: వాయు కాలుష్యంతో ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతోంది..