Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి రేపు(నవంబర్ 24) ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చెయ్యనున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుమల, తిరుపతిలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో గదులను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
Also Read: Thummala Nageshwara Rao: కేసీఆర్, నేను ఇప్పటికీ మిత్రులమే.. ఎలాంటి విభేధాలు లేవు..
ఇదిలా ఉండదా.. 2024 ఫిబ్రవరి 16న రథసప్తమికి సంబంధించి శ్రీవారి సేవ స్లాట్లను నవంబరు 27న ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 18 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న వారే ఈ స్లాట్లను బుక్ చేసుకునేందుకు అర్హులు. తిరుమల, తిరుపతిలో భక్తులు స్వచ్ఛందసేవ చేసేందుకు జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ కోటాను నవంబరు 27న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3గంటలకు పరకామణి సేవ కోటాను తితిదే విడుదల చేయనుంది.
మరోవైపు.. ఈ నెల 27న శ్రీవారి ఆలయంలో సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. 26వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణను టీటీడీ రద్దు చేసింది.