Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. 2023, డిసెంబర్ నెలలో జరిగే ఉత్సవ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
– డిసెంబరు 3న పార్వేట మండపంలో కార్తీక వనభోజన ఉత్సవం.
– డిసెంబరు 8న సర్వ ఏకాదశి.
– డిసెంబరు 12న అధ్యయనోత్సవాలు ప్రారంభం.
– డిసెంబరు 17న ధనుర్మాసం ప్రారంభం.
– డిసెంబరు 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్న శాత్తుమొర.
– డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం. స్వర్ణరథోత్స\వం.
– డిసెంబరు 24న వైకుంఠ ద్వాదశి నాడు శ్రీవారి చక్రస్నానం. శ్రీ స్వామి పుష్కరిణితీర్థ ముక్కోటి.
– డిసెంబరు 28న శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం
Read Also: Jammu kashmir: పాకిస్తాన్ నీచబుద్ధి.. ఆలయాన్ని కూల్చివేసి కాఫీ హౌస్ నిర్మాణం