తిరుమల తిరుపతి దేవస్థానం తన అధికారిక వెబ్సైట్ పేరులో మరోసారి మార్పులు చేర్పులు చేసింది. ఇప్పటి వరకు ఈ వెబ్సైట్ పేరు thirupathibalaji.ap.gov.in అని కనిపించేది.. కానీ, దానిని ttdevasthanams.ap.gov.in గా మారుస్తున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. కొన్ని నెలలుగా స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులను స్వామివారికి సమర్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హుండీకి కాసుల వర్షం కురుస్తోంది.
తిరుమలలో ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. శనివారం వేకువజామున 1.30 గంటలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తం శ్రీవారి ఆలయానికి ప్రక్కనే ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ముందుగా శ్రీనివాసుడికి నిత్య కైంకర్యాలు, తిరుప్పావై పఠనం చేసిన తర్వాత భక్తులను వైకుంఠ ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు.
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారు జాము నుంచే స్వామివారి దర్శనం కోసం ఆలయాల దగ్గర భక్తులు బారులు తీరారు.
వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు వీఐపీలు క్యూ కడుతున్నారు. సుప్రింకోర్టు నుంచి 7 మంది, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 35 మంది న్యాయమూర్తులు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తిరుమలకు ఏపీకి చెందిన ముగ్గురు మంత్రులు, ఏపీ అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ చేరుకున్నారు.
వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులకు అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం నేటి మధ్యాహ్నం 2గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు కేటాయించాలని టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
తిరుమల తిరుపతిలో రేపు సర్వ దర్శనం భక్తులకు జారి చేసే టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. ఇక, రేపు మధ్యహ్నం నుంచి సర్వ దర్శనం భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు జారీ చేయనుంది.