Tirumala: రేపు తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: రేపు ( సోమవారం) తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఘనంగా జరుగనుంది. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తుంబురు తీర్థానికి ఇవాళ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, మళ్లీ రేపు ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతిస్తారు. అలాగే పాపవినాశనం డ్యామ్ దగ్గర భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీరు అందించనున్నారు. ఇక, ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.
Read Also: Gold Price Today : గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఎంతంటే?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
కాగా, తుంబురు తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సింది వస్తుంది. కాబట్టి.. గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి పర్మిషన్ లేదని టీటీడీ తెలిపింది. పలువురు భక్తులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అధికారులు తెలిపారు. అలాగే భక్తులు వంట సామగ్రి, కర్పూరం, అగ్గి పెట్టెలు తీసుకురావొద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది. ఇక, పోలీసుశాఖ, అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుంచి తుంబురు తీర్థం వరకు భద్రతా సిబ్బందిని ఉంచి భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు. అలాగే, ఫాల్గుణ మాసంలో ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. రేపు తీర్థస్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అయితే, ప్రకృతి సౌందర్యాల మధ్య నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తుంటారు. ఈ ముక్కోటిలో టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ఇక, జూన్ నెలకు సంబంధించి శ్రీవారి సేవ యొక్క ఆన్‌లైన్ కోటా టికెట్లను ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు అలాగే, పరకామణి సేవ తిరుమల కోసం మధ్యాహ్నం 1 గంటకు టికెట్లను టీటీడీ రిలీజ్ చేయనుంది. రేపు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడసేవ కొనసాగనుంది. ప్రతి నెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
Tumburu Theertha Mukkoti on March 25
One of the major torrent festivals, Tumburu Theertha Mukkoti is scheduled on March 25 on the auspicious day of Phalguna Pournami in the advent of Uttara Phalguni star. pic.twitter.com/Eo2SF2KljI
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) March 21, 2024
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..