భారతదేశంలో ఆంధ్రరాష్ట్రం అత్యున్నత స్థానంలో ఉండాలన్నదే తన ధ్యేయమన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో.. సృష్టించిన సంపద ప్రతి పేదవాడికి చేరవేయాలన్న సంకల్పంకూడా అంతే ముఖ్యం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక పై ఎన్డీయే కూటమి పేదరికం లేని దేశం తద్వారా పేదరికం లేని రాష్ట్రాన్ని తీసుకురావాలన్న స్పూర్తితో పని చేస్తుంది అన్నారు. తిరుమలకు వస్తే వైకుంఠానికి వచ్చిన అనుభూతి కలుగుతుందని ఇక్కడ పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదన్నారు. ఇకపై తిరుమల…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పద్మావతి అమ్మవారిని సీఎం దర్శించుకున్నారు.
గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు.కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని.. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి..
గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. కానీ ఈ సారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని.. ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 93 శాతంపైగా విజయం దేశ చరిత్రలో ఎవరికి రాలేదన్నారు. వెంకటేశ్వర స్వామి ముందు సంకల్పం చేసుకొని ముందుకు వెళ్తానని ఆయన చెప్పారు. కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ జేఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం టోకెన్ లేని భక్తులకు 16 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమలలో వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి భక్తులు 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఇక శనివారం నాడు శ్రీవారిని 79398 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 43567 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండి ఆదాయం 2.9 కోట్లుగా వచ్చింది. ఇకపోతే జూన్ 18వ తేది నుంచి ఆన్ లైన్ లో సెప్టెంబర్ నెలకు సంభందించిన దర్శన టికేట్లు విడుదల చేయనుంది టిటిడి. IND…
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరగింది. శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా వెళ్లిన వారికి దర్శనం చేసుకునేందుకు టైం పడుతుందని టీటీడీ తెలిపింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వెల్లడించింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. రేపు(శుక్రవారం) ఉదయం అమిత్షా శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం తిరుమల నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.