Shocking Video: తిరుమల జాపాలి వద్ద యువతిపై పడిన చెట్టు కొమ్మ.. వీడియో వైరల్..
- తిరుమలలో యువతి జాపాలి హనుమాన్ ఆలయం వద్ద ఘటన.
- ఒక్కసారిగా భారీచెట్టు నుంచి కొమ్మ తెగి యువతి తలమీద బలంగా పడింది.
- ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Video Tree of branch fell on lady devotee : కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన గాని దేవుడని దర్శనం చేసుకున్నందుకు గంటల సమయం పడుతుంది. ఈ మధ్యకాలంలో తిరుమలలో వన్య ప్రాణుల సంచారం ఎక్కువైందన్న విషయాలు ఎక్కువగా మీడియాలో వస్తున్నాయి. ముఖ్యంగా నడక మార్గం ద్వారా వెళుతున్న సమయంలో అనేకమంది చిరుత పులిలను చూసినట్లుగా తెలిపారు భక్తులు. అంతేకాదు ప్రస్తుతం వర్షాకాలం సమయం కాబట్టి తిరుమలలో పాముల సంచారం కూడా ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఇక రాత్రి పుట అయితే చాలు ఎలుగుబండ్లు, చిరుతలు తిరుమల రోడ్డు మార్గంలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో భక్తులు ఇటీవల కాలంలో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇకపోతే తాజాగా తిరుమలలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Child Selling: కన్న కూతురిని లక్ష రూపాయలకు అమ్మిన కసాయి తండ్రి..
Also Read
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఓ అమ్మాయికి అనుకోని సంఘటన ఎదురయింది. రెప్ప పాటు సమయంలో ఆమెకు పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. కాకపోతే ఆమె నడుముకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆ అమ్మాయి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకుంది. స్వామివారి దర్శనం అనంతరం ఆ అమ్మాయి జాపాలి ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు వెళ్ళింది. అయితే అక్కడ ఉన్న ప్రకృతి అందాలను చూడడం మొదలుపెట్టింది. అయితే అనుకోకుండా ఆ సమయంలో ఆ అమ్మాయి నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా చెట్టు పై నుంచి ఓ భారీ కొమ్మ విరిగి బలంగా ఆమె తల మీద పడింది. దీంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా అక్కడే కింద పడిపోయింది. దీంతో అక్కడ చుట్టుపక్క వారు ఏం జరిగిందోన్న విషయం ఆలోచించే లోపల అక్కడ అమ్మాయి కింద పడిపోయింది. వెంటనే అక్కడ ఉన్నవారు పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే ఆంబులెన్స్ కు సమాచారం అందించి అమ్మాయిని టీటీడీ వారి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆ అమ్మాయికి వెన్నుపూసకు బలంగా గాయమైనట్లు సమాచారం. అయితే చెట్టుకొమ్మ ఆ అమ్మాయి మీద పడిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
Hardik Pandya – Natasa : హార్దిక్ తో విడాకులపై క్లారిటీ ఇచ్చిన నటాషా స్టాంకోవిచ్..?
తిరుమలలో యువతిపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ.. యువతికి తీవ్ర గాయాలు
తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్తున్న ఓ యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది.
తల, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. pic.twitter.com/I1WzTdJjfb
— Telugu Scribe (@TeluguScribe) July 12, 2024
తాజావార్తలు
-
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!