తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి దర్శనానికి ఆగస్టు నెలకు సంబంధించి 300 రూపాయల టికెట్లు, వసతి గదులు ఆన్లైన కోటా రిలీజ్ కానున్నాయి.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అపర భక్తురాలైన తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు మే 22వ తేదీన తిరుమలలో వైభవంగా జరగనున్నాయి. సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యాణవనంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్టుకు కుటుంబసమేతంగా చేరుకున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు ఆగస్టు నెల టికెట్లు రిలీజ్ చేయనున్నారు. తిరుమలలో ఇవాళ ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చెయ్యనుంది.
తిరుమలలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలోని అఖరి మెట్లు వద్ద రెండు చిరుతలు సంచరించాయి. చిరుతలను చూసిన భక్తులు భయంతో బిగ్గరగా కేకలు పెట్టారు. భక్తుల కేకలతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి.
తిరుమలలో భక్తుల రద్దీ గత మూడు రోజులుగా కొనసాగుతుంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. ఇక, ఫ్రీ దర్శనానికి దాదాపు 16 గంటలకు పైగా సమయం పడుతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. ఆగస్టు నెలకు సంబంధించిన దర్శనం టికెట్లతో పాటు.. వివిధ రకాల సేవా టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)..
కలియుగ స్వామి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి భక్తులు వారి కోరికల మేరకు ప్రతిరోజు ఎన్నో రకాల కానుకలను స్వామివారికి సమర్పిస్తుంటారు. ఇకపోతే., తిరుమల వెంకన్న స్వామికి శనివారం ఒక లారీ విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్ లేలాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ కుమార్ రూ.31.31 లక్షల విలువైన లారీని అందజేశారు టీటీడీ అధికారులకు అందచేసారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట కొత్త వాహనానికి పూజలు నిర్వహించి, తాళాలను ఈవో…