Tirupati: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో భారీ ఎత్తున ఉద్యోగుల పదవీ విరమణ చేస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 113 మంది ఉద్యోగుల పదవీ విరమణ చేశారు. ఇద్దరు డిప్యూటి ఈఓ స్థాయి ఉద్యోగులుతో పాటు అటెండర్ స్థాయి ఉద్యోగుల వరకు పదవీ విరమణ చేశారు.
తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు అలర్ట్ చేశారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది అని తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయని చెప్పారు.
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది.
తిరుమలలో ఓ భారీ పాము హల్చల్ చేసింది. దాదాపు 7 అడుగులుండే ఓ జెర్రిపోతు భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వెంటనే పాము సంచరిస్తుందని టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. పాములు పట్టే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని భారీ సైజుతో ఉన్న పామును పట్టుకున్నారు. స్థానికులు తిరిగే డీ టైప్ క్వార్టర్స్ వద్ద ఈ పామును గుర్తించారు. తరువాత దూరంలో అటవీ ప్రాంతంలో జెర్రిపోతు పామును వదిలేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. మరోవైపు.. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. అలాగే నిన్న (సోమవారం) అర్ధరాత్రి వరకు 71,824 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,462 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండి ఆదాయం 4.01 కోట్లు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు.
తిరుమల శ్రీవారి మెట్టు నడకదారిలో టోకెన్ల స్కానింగ్ను టీటీడీ పునఃప్రారంభించింది. 1200 మెట్టు వద్ద స్కానింగ్ అనంతరం భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. గతంలో ఆలయ తలుపుల నుంచి టోకెన్ వెళ్లే విధానాన్ని టీటీడీ అధికారులు మార్చారు. అయితే స్కానింగ్ పద్ధతి లేకపోవడంతో నడకదారిలో భక్తులకు పంపే టోకెన్లు పక్కదారి పడటంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనితో పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలని టీటీడీ అధికారులు ఆదేశించారు.
Trivikram : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించారు.గత ఎన్నికలలో తాను పోటీ చేసిన భీమవరం ,గాజువాక రెండు నియోజకవర్గాలలో పవన్ ఓటమి చెందాడు.ఓటమి చెందినందుకు క్రుంగిపోకుండా ఎంతో ఓర్పుతో వ్యవహరించారు.గత ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ నిత్యం ప్రజలలోనే మమేకం అయ్యారు.ఈ సారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ బీజేపీ,టీడీపీ తో కలిసి కూటమిగా ఏర్పడ్డారు .కూటమిలో భాగంగా జనసేన తరపున…