TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. శ్రీవారి వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను ఈ రోజు ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది టీటీడీ.. ఇవాళ ఆన్‌లైన్ లో సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. ఇక, ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ దర్శన టికెట్లు విడుదల కానుండగా.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయబోతున్నారు.. మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్ల కోటా కూడా విడుదల కాబోతున్నాయి..
Read Also: Anti Paper Leak Law: పేపర్ లీక్‌కు పాల్పడితే 10 ఏళ్ల జైలు.. రూ.కోటి వరకూ ఫైన్
మరోవైపు ఇవాళ శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ నిర్వహిస్తోంది టీటీడీ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది.. వేసవి సెలవులు ముగిసి.. స్కూళ్లు ప్రారంభమైనా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.. ఈ రోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి.. వెలుపల క్యూ లైన్‌లో వేచిఉన్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 72,294 మంది భక్తులు దర్శించుకున్నారు.. 31855 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. ఇక, హుండీ ఆదాయం రూ.3.39 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.