Tiger in Komaram Bhim: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరిస్తున్న పులి తాజాగా బెజ్జూరు మండలం కుకుడ గ్రామంలో ఎద్దుపై దాడి చేసింది. దీంతో ఎద్దు తీవ్రంగా గాయపడింది. గ్రామస్తులు సోమవారం ఉదయం స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి సంచరిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని అధికారులు కోరుతున్నారు. బాబాసాగర్ ప్రాంతంలోని చొప్పదండి మొండి కుంట వద్ద మీసాల రాజన్న అనే రైతుకు పులి కనిపించిందని తెలిపాడు. పులిని చూసి పరుగులు పెడుతూ ఇంటికి వచ్చినట్లు స్ధానికులు చెపుతున్నారు.
Read also: Mangaluru Auto Blast: మంగళూరు ఆటో పేలుడు కేసులో పురోగతి.. నిందితుడికి ఐసిస్‌తో సంబంధాలు
రెండు రోజుల క్రితం కాగజ్‌నగర్ మండలం వేంపల్లి – చలాడ గ్రామ శివారులో కొందరు ప్రయాణికులకు పెద్దపులి కనిపించింది. పులాస్ సర్దార్ అనే వ్యక్తి ప్రాంగణంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఆ పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పులి పాదముద్రలను గుర్తించారు. ఖానాపూర్, కాగజ్ నగర్, ఎజ్గాం మీదుగా పెద్దపులి వేంపల్లికి చేరుకుందని తెలిపారు. దీని ఆచూకీ కోసం 12 బృందాలు వెతుకుతున్నాయని చెప్పారు. ఇక, తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి, మంగపేట మండలాల్లో మూడు రోజులుగా పులి సంచారం కలకలం రేపుతోంది. తాడ్వాయి మండలం కామరం అటవీ ప్రాంతంలో పశువుల మంద దాడికి యత్నించింది. మంగపేట మండలంలో లేగ దూడపై దాడి చేసి చంపేసింది. తాడ్వాయి మండలం కామరం అడవుల్లో మేతకు వెళ్లిన ఎద్దుల మందపై పెద్దపులి దాడికి యత్నించింది. అది చూసిన పశువుల కాపరి టైగర్ రమేష్ భయంతో అరిచాడు. దీంతో పులి అక్కడి నుంచి పారిపోయింది.
Revanth Reddy: అసైన్డ్ భూములకు అర్హులకు పట్టాలు ఇవ్వాలి